నల్లగొండ టూటౌన్: కలెక్టర్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వినతులు వెల్లు వెత్తాయి. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ ఇలా త్రిపాఠికి మొర పెట్టుకుంటున్నారు. ఆసరా పించన్లు, సదరమ్ సర్టిఫికెట్లు, ప్రధానంగా భూ సమస్యలపై ఎక్కువగా కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు. తమ సమస్యలపై మాటిమాటికి వినతి పత్రాలు అందిస్తున్నా పరిష్కారం చూపడంలేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితులకు అండగా ఉండాలి
నల్లగొండ: బాధితులకు అండగా ఉంటూ వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డేలో 45 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించి మాట్లాడారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకొని వెంటనే వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సంబంధిత అధికారులతో ఫోన్‌లో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలన్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
హాస్టళ్లలో బాలికలకు అసౌకర్యం కలిగించొద్దు
తిప్పర్తి : సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న బాలికలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఎస్సీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) శశికళ అన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలోని బాలికల హాస్టల్‌ను సోమవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా బాలికలతో మా ట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అమ్మాయిల పట్ల మర్యాదగా నడుచు కోవాలని, అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన శిక్షలు తప్పవన్నారు. ఆమెవెంట హాస్టల్ వార్డెన్ ఉన్నారు.
ఫ శివ పూజ
నల్లగొండ పట్టణ పరిధిలోని పానగల్ వద్ద ఛాయా సోమేశ్వరాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక అలంకరణలో శివలింగం
ప్రజావాణికి తరలొచ్చిన జనం


