కొబ్బరికాయ రూ.40కే.. | - | Sakshi
Sakshi News home page

కొబ్బరికాయ రూ.40కే..

Nov 4 2025 7:46 AM | Updated on Nov 4 2025 7:46 AM

కొబ్బ

కొబ్బరికాయ రూ.40కే..

న్యూస్‌రీల్‌

యాదగిరి కొండపైన కొబ్బరికాయ రూ.40కే విక్రయించాలని ఆలయ అధికారులు దుకాణదారులకు సూచించారు.

మంగళవారం శ్చ్రీ 4 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

- 10లో

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ముఖ్యమంత్రిగా నేను, మంత్రిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లగొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రాజెక్టుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో ఇంకెప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తవదు. 2005లో మొదలైన ఈ ప్రాజెక్టును బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పూర్తిచేసి తీరుతాం.

– మన్నెవారిపల్లి ఔట్‌లెట్‌ వద్ద సర్వే ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 3 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందించేందుకు చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి హామీతో ఆశలు చిగురిస్తున్నాయి. వివిధ కారణాలతో ఇన్నాళ్లూ ఆగిపోయిన పనులను ప్రారంభించేందుకు చేపట్టిన అత్యాధునిక వీటెమ్‌ ప్లస్‌ హెలీబోర్న్‌ ఏరియల్‌ ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ జియోఫిజికల్‌ సర్వే పనులను ఆయన సోమవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా మన్నెవారిపల్లి ఔట్‌లెట్‌ వద్ద ప్రారంభించారు. ప్రాజెక్టుకు పూర్తికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

వైఎస్సార్‌ హయాంలో పనులు ప్రారంభం

శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి పూర్తి గ్రావిటీ ద్వారా నల్లగొండ జిల్లాకు నీటిని తరలించి సస్యశ్యామలం చేసేందుకు 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. 2005లో పనులు ప్రారంభం అయ్యాయి. వైఎస్సార్‌ మరణం తరువాత పనులు నెమ్మదించాయి. ఆ తరువాత రాష్ట్రం ఏర్పడింది. పనులు వేగంగా జరుగుతాయని భావించినా జరగలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టిసారించారు.

ప్రమాదంతో ప్రత్యామ్నాయ చర్యలు

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని శ్రీశైలం రిజర్వాయర్‌ సమీపంలోని దోమలపెంట ఇన్‌లెట్‌ నుంచి అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద ఔట్‌లెట్‌ వరకు 43.930 కిలోమీటర్ల పొడవునా సొరంగాన్ని 10 మీటర్ల డయాతో (వెడల్పు) రెండు వైపులా తవ్వేలా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. 34.37 కిలోమీటర్లు టన్నెల్‌ తవ్వకం పూర్తికాగా, ఇంకా 9.56 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. ఔట్‌లెట్‌ గట్టి రాయి కారణంగా తరచూ బేరింగ్‌ పాడయిపోతుండగా, ఇన్‌లైట్‌లో సీపేజీ కారణంగా 2019లోనే పనులు ఆగిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పనులను చేపట్టగా టన్నెల్‌ కూలిపోయింది. ఆ ప్రమాదంలో కొందరు చనిపోయారు. దీంతో అక్కడ ఇక మళ్లీ పనులు కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వంప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది.

వీలైనంత త్వరగా పనులు

చేపట్టేలా కార్యాచరణ

ప్రాజెక్టును పూర్తిచేసేందుకు చిత్తశుద్ధితో ఉన్న ప్రభుత్వం టన్నెల్‌ ఇన్‌లెట్‌ జరిగిన ప్రమాదం తరువాత ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ప్రభుత్వం నిఫుణుల కమిటీ నియమించింది. ఆ కమిటీ టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌తో ఇక తవ్వడం కుదరదని, డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ పద్ధతిలో తవ్వాలని సూచించింది. అందులో భాగంగానే ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ సర్వేను సోమవారం ప్రారంభించింది. భూమి లోపల వెయ్యి మీటర్ల వరకు పరిస్థితి అంచనా వేసి పనులు చేపట్టనుంది. ఈ సర్వే పూర్తయ్యాక వచ్చే నివేదికంగా ఆధారంగా కార్యాచరణను సిద్ధం చేయనుంది. వీలైనంత త్వరగా పనులను ప్రారంభించి 2028 నాటికి పూర్తిచేస్తామని సీఎం వెల్లడించారు.

ఫ ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ సర్వేను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఫ సర్వే పూర్తికాగానే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులు మొదలుపెట్టేలా కసరత్తు

ఫ 2028 నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తామని సీఎం స్పష్టీకరణ

కొబ్బరికాయ రూ.40కే.. 
1
1/3

కొబ్బరికాయ రూ.40కే..

కొబ్బరికాయ రూ.40కే.. 
2
2/3

కొబ్బరికాయ రూ.40కే..

కొబ్బరికాయ రూ.40కే.. 
3
3/3

కొబ్బరికాయ రూ.40కే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement