జనగణన పారదర్శకంగా చేపట్టాలి
తిప్పర్తి: జనగణన–2027 ప్రక్రియను పారదర్శకంగా చేపడితేనే అర్హులైన ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు సులువుగా అందించవచ్చని సెన్సెస్ ఆపరేషన్ తెలంగాణ డైరెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. సోమవారం తిప్పర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో జనగణనపై ఎన్యుమరేటర్లకు నిర్వహిస్తున్న శిక్షణలో ఆమె మాట్లాడారు. జనగణన చేయడం వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు ఏయే సౌకర్యాలు అవసరమో గుర్తించి కల్పించవచ్చన్నారు. వారి స్థితిగతులు, ఆహారపు అలవాట్లను కూడా తెలుసుకుని కల్పంచవచ్చన్నారు. ఇది డిజిటల్ సెన్సెస్ కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన ఫార్మెట్ ప్రకారం ఎన్యుమరేటర్లు జనగణన చేపట్టాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గణాంకాల జేడీ లాజరస్, తహసీల్దార్ రామకృష్ణ, ఆర్‌ఐ ద్రోణార్జున శ్రీకృష్ణ, ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.


