చెర్వుగట్టుకు పోటెత్తిన భక్తజనం
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు గ్రామంలోని శ్రీపార్వతి జడలరామలింగేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నా రు. కార్తీక పూజలు, అభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్నారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. దేవుని పాదాల వద్ద ఉదయం 8 గంటల వరకు కూడా చెత్త తొలగించకపోవడంతో అక్కడ దీపాలు వెలిగించేందుకు మహిళలు ఇబ్బందులు పడ్డారు. గట్టు కింద టోల్‌గేట్ నిర్వాహకులు టోల్ రుసుము తీసుకుని వాహనాలను గట్టుపైకి పంపి అక్కడ ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సీనియర్ అసిస్టెంట్‌లు ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, యాదయ్య, రాజ్యలక్ష్మి, నరేష్, మహేందర్‌రెడ్డి, అర్చకులు శ్రీకాంత్, సురేష్, సతీష్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
చెర్వుగట్టుకు పోటెత్తిన భక్తజనం


