నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి
చండూరు: వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించి ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం చండూరులో జరిగిన ఆ పార్టీ మునుగోడు నియోజకవర్గ స్థాయి మండల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి షరతులు లేకుండా తడిసిన పత్తి, ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. సమావేశంలో నలపరాజు రామలింగయ్య, అంజయ్యచారి, రామమచంద్రం, నరసింహ, వెంకటేశ్వర్లు, సతీష్‌కుమార్, రమేష్, శేఖర్, చలపతి, లాలు, రామములు, సురేష్, భిక్షంరెడ్డి, వెంకటేశ్, యాదయ్య పాల్గొన్నారు.
పత్తి కొనుగోలు కుదింపు సరికాదు
మునుగోడు: పాత నిబంధన ప్రకారం ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలని, అలా కాకుండా కేవలం 7 క్వింటాళ్లకు కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదని ఎమ్మెల్సే నెల్లికంటి సత్యం అన్నారు. సోమవారం మునుగోడుకు వచ్చిన ఆయనకు స్థానిక రైతులు ఈ విషయాన్ని తెలిపి తమ సమస్యను విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎకరాకు కనీసం 10 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. దానిని సీసీఐ అధికారులు గుర్తించి గతంలో కంటే మరో 3 క్వింటాళ్లు పెంచి ఎకరానికి 15 క్వింటాళ్లకు తగ్గకుండా కొనుగోలు చేయాలన్నారు.
ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం


