పథకాల అమలు తీరును పర్యవేక్షించాలి
నల్లగొండ: ప్రత్యేక అధికారులు మండలాల్లో పర్యటిచేస్తూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం ఆమె నల్లగొండ కలెక్టరేట్‌లో ప్రజావాణి అనంతరం వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, కేజీబీవీలు, ఇతర విద్యాసంస్థలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. బాల్యవివాహాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడితే శిక్షలు తప్పవని అధికారులు స్పష్టంగా తెలియజేయాలన్నారు.
ఉపాధి కల్పనకు సెట్విన్ ద్వారా శిక్షణ
పది, ఇంటర్ చదివిన విద్యార్థులకు ఉపాధి కల్పించేందుకు సెట్విన్ ఆధ్వర్యంలో వృత్తిపరమైన శిక్షణ ఇవ్వనున్నట్టు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సెట్విన్ ద్వారా ఇచ్చే వృత్తిపర కోర్సుల శిక్షణపై సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించి సమావేశంలో ఆమె మాట్లాడారు. మంగళవారం (ఈనెల 4న) నల్లగొండలోని రామ్‌నగర్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో 26 రకాల కోర్సుల్లో శిక్షణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. రెసిడెన్షియల్, కేజీబీవీ విద్యార్థులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఇన్‌చార్జి డీఆర్‌ఓ వై.అశోక్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, చండూరు, దేవరకొండ ఆర్డీఓలు శ్రీదేవి, రమణారెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


