చెర్వుగట్టు అభివృద్ధిపై మంత్రుల సమీక్ష | - | Sakshi
Sakshi News home page

చెర్వుగట్టు అభివృద్ధిపై మంత్రుల సమీక్ష

Nov 4 2025 7:44 AM | Updated on Nov 4 2025 7:44 AM

చెర్వుగట్టు అభివృద్ధిపై మంత్రుల సమీక్ష

చెర్వుగట్టు అభివృద్ధిపై మంత్రుల సమీక్ష

నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీపార్వతి జడలరామలింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌పై సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్షించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి నిర్వహించిన ఈ సమీక్షలో ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సురేఖ చర్చించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా గట్టుపైన, కింద కల్పించాల్సిన సౌకర్యాలకు సంబంధించి ప్రతిపాదన పంపినట్లు సమాచారం. ఈ సమీక్షలో నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్యర్‌, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement