భువనగిరి–చిటా్యల రోడ్డు యమ డేంజర్‌! | - | Sakshi
Sakshi News home page

భువనగిరి–చిటా్యల రోడ్డు యమ డేంజర్‌!

Nov 4 2025 6:56 AM | Updated on Nov 4 2025 6:56 AM

భువనగ

భువనగిరి–చిటా్యల రోడ్డు యమ డేంజర్‌!

2015లో లారీ, బస్సు ఢీకొని

పది మంది మృతి

ఆశలన్నీ ‘హ్యామ్‌’పైనే..

అధికంగా మూలమలుపులు.. తరచూ ప్రమాదాలు

సాక్షి యాదాద్రి: భువనగిరి – చిట్యాల రహదారిపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఉత్తర – దక్షిణాది రాష్ట్రాలకు వారధిగా ఉన్న ఈ మార్గంలో నిత్యం ఎక్కడో చోట ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరుకు రోడ్డు, కిలో మీటరుకు ఒక మలుపు, భద్రతాచర్యల లేమితో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నా.. రహదారి విస్తరణకు నోచడం లేదు. పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడో, ప్రజలు ఉద్యమించినప్పుడు మాత్రమే అధికారులు తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నారు. శాశ్వత పరిష్కారానికి ప్రయత్నించడం లేదు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో భువనగిరి–చిట్యాల రహదారిపై భద్రత చర్చనీయాంశమైంది.

రోజూ 10వేలకు పైగా వాహనాల రాకపోకలు

ఉత్తర– దక్షిణ భారత దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరుకు రవాణాకు ప్రధాన మార్గం భువనగిరి – చిట్యాల రోడ్డు. దీనికి తోడు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి వివిధ రకాల వాహనాలు, బస్సులతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. 43 కిలో మీటర్ల ఈ మార్గంలో రోజూ 12 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

ప్రాణాలు తీస్తున్న మలుపులు

చిట్యాల నుంచి రామన్నపేట వరకు 10 చోట్ల ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఇందులో అతి ప్రమాదకరమైనది ఇంద్రపాలనగరం నుంచి నిధానపల్లి గ్రామానికి వెళ్లే చౌరస్తా ఒకటి. 2015 అక్టోబర్‌ 7న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో 10 మంది మృత్యువాత పడ్డారు. చిట్యాల సమీపంలోని ఐడీఎల్‌ ప్యాక్టరీ వద్ద రెండు మలుపులు, రామన్నపేట డిగ్రీ కళాశాల వద్ద, రామన్నపేట హరిహరపుత్ర రైస్‌ మిల్‌ వద్ద, ఇంద్రపాలనగరం చెరువు, రామన్నపేట కుంట, ఇంద్రపాలనగరం అయ్యప్ప దేవాలయం, గుర్జాలబావి, వలిగొండ మండలం నాగారం–మూసీ బ్రిడ్జి, వలిగొండ జూనియర్‌ కళాశాల, అక్కంపల్లి అంజనేయస్వామి టెంపుల్‌, భువనగిరి మండలం నందనం పోచమ్మగుడి, నందనం–అనాజిపురం హన్మాన్‌గుడి వద్ద, నాగిరెడ్డి రైల్వే స్టేషన్‌ ముందు, మాందాపురం దుర్గమ్మగుడి టెంపుల్‌, అనాజిపురం వద్ద మూల మలుపులు అతి ప్రమాదకరంగా ఉన్నాయి. అలాగే భువనగిరి మండలం వడపర్తి, తిర్మలాపురం, సంగ్యాతండా వద్ద ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఇవి కాకుండా చిన్న మలుపులు 30 వరకు ఉంటాయి.

జాతీయ రహదారిగా గుర్తింపు

చిట్యాల నుంచి భువనగిరి మీదుగా గజ్వేల్‌ వరకు రోడ్డు ఉంది. జిల్లాలోని ఎన్‌హెచ్‌–65 నుంచి ఎన్‌హెచ్‌– 163 మీదుగా బెంగళూరు నుంచి నాగ్‌పూర్‌ జాతీయ రహదారి వెళ్లే నేషనల్‌ పర్మిట్‌ వాహనాల ప్రయాణానికి అనుసంధానంగా ఉంటుంది. ఇందులో గజ్వేల్‌నుంచి తుర్కపల్లి, భువనగిరి మీదుగా నాగిరెడ్డిపల్లి, చౌటుప్పల్‌ వరకు జాతీయ రహదారి 161 ఏఏగా నామకరణం చేసి వదిలేశారు. నాగిరెడ్డిపల్లి నుంచి వలిగొండ, రామన్నపేట చిట్యాలవరకు రాష్ట్ర రహదారిగానే ఉంది. ఈ మార్గంలో గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, డిల్లీ, రాజస్థాన్‌, పంజాబ్‌, తమిళనాడు, కేరళ, ఆంధ్రదప్రదేశ్‌.. ఇలా దేశ నలుమూలలకు సరుకు రవాణాకు చెందిన భారీ వాహనాలు నిత్యం ప్రయాణిస్తాయి. అయితే ఇదే మార్గంలో స్థానిక ప్రయాణికులు ఆర్టీసీ బస్‌లు, కార్లు,ఆటోలు, ద్విచక్రవాహనాల్లో ప్రయాణిస్తారు. పలుమార్లు ప్రమాదాలు జరిగి ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారు.

రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం శివారులో 2015 అక్టోబర్‌ 7వ తేదీ సాయంత్రం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో 10 మంది మృత్యువాతపడ్డారు. 18 మంది తీవ్రగాయాల పాలయ్యారు. నార్కట్‌పల్లి డిపోకు చెందిన బస్‌ భువనగిరి నుంచి మధ్యాహ్నం 2.45గంటలకు 40మంది ప్రయాణికులతో నల్లగొండకు బయలు దేరింది. రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం దాటిన తరువాత నిధానపల్లికి వెళ్లే దారి వద్ద ఉన్న మూలమలుపునకు రాగానే రామన్నపేట నుంచి భువనగిరి వైపు అతివేగంగా పుస్తకాల లోడుతో వచ్చిన లారీ బస్సును ఢీకొట్టగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఫ ఏటా పదుల సంఖ్యలో ప్రమాదాలు

ఫ గాల్లో కలుస్తున్న ప్రాణాలు

ఫ ఇంద్రపాలనగరం వద్ద పదేళ్ల క్రితం జరిగిన ఘటనలో పది మంది మృతి,

ఫ చేవెళ్ల ఘటన నేపథ్యంలో రోడ్డు భద్రతపై చర్చ

భువనగిరి – చిట్యాల వరకు హ్యామ్‌(హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌) పథకంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. 43 కిలో మీటర్ల మేర రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. భువనగిరి నాగిరెడ్డిపల్లి, టేకులసోమారం, వలిగొండ, నాగారం, తుమ్మలగూడెం, బోగారం, రామన్నపేట, చిట్యాల వరకు రోడ్డును అభివృద్ధి చేస్తారు. రోడ్ల వెడల్పు, మధ్యలో డివైడర్‌లు, అండర్‌పాస్‌లు, ఫ్‌లై ఓవర్లు, జంక్షన్లు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న జంక్షన్లను వెడల్పు చేస్తారు.

భువనగిరి–చిటా్యల రోడ్డు యమ డేంజర్‌!1
1/2

భువనగిరి–చిటా్యల రోడ్డు యమ డేంజర్‌!

భువనగిరి–చిటా్యల రోడ్డు యమ డేంజర్‌!2
2/2

భువనగిరి–చిటా్యల రోడ్డు యమ డేంజర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement