ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలి
యాదగిరిగుట్ట: కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన మాజీ మంత్రి హరీష్‌రావు, సంతోష్‌రావు, వీరి బినామీలను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. మాజీ ఎంపీ కవిత ఆరోపణలతో హరీష్‌రావు, సంతోష్‌రావులపై చర్యలు తీసుకొని, వారిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో పట్టణ సీఐ భాస్కర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఎంపీ కవిత చేసిన అవినీతి ఆరోపణల ఆధారణంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ సంపదను దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ అవినీతిని స్వయంగా కేసీఆర్ కుమార్తె కవిత నిర్ధారించారని పేర్కొన్నారు. ప్రజా పాలనపై బీఆర్‌ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి అనే మర్యాద లేకుండా రేవంత్‌రెడ్డి చెంప చెల్లుమనిపించాలని మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడటం సరైంది కాదన్నారు. బీఆర్‌ఎస్ దోచుకున్నందుకు 2023 ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, కంటోన్మెంట్ ఎన్నికల్లో ఇంటికి పంపించారని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సైతం బీఆర్‌ఎస్‌కు చెంప చెల్లుమనేలా ఓటర్లు సమాధానం ఇస్తారన్నారు. వీరి వెంట డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, నాయకులు బందారపు బిక్షపతి, చీర శ్రీశైలం, ముక్కెర్ల మల్లేశం, గుండ్లపల్లి భరత్, ఎరుకల హేమేందర్ తదితరులు ఉన్నారు.
విచారణ చేపడుతున్నాం..
మాజీ మంత్రి హరీష్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్, నవీన్‌రావులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సోమవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని యాదగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్ తెలిపారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేస్తున్నామని, తదుపరి చర్యలు తీసుకుంటామని, ఇంకా కేసు నమోదు చేయలేదని సీఐ పేర్కొన్నారు.
హరీష్‌రావు, సంతోష్‌రావుపై
విచారణ చేపట్టాలి
యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో
ఎంపీ, ఎమ్మెల్యే ఫిర్యాదు


