విజిలెన్స్ అధికారుల ప్రతిజ్ఞ
నల్లగొండ : విద్యుత్ విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా సోమవారం విద్యుత్ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట విద్యుత్ అధికారులతో విజిలెన్స్ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. వినియోగదారులకు సేవలు అందించడంతో పాటు ఎవరూ అక్రమాలకు పాల్పడవద్దని చెప్పడంతోపాటు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విజిలెన్స్ అధికారి మహేందర్ ప్రతిజ్ఞ చదివించారు. కార్యక్రమంలో విద్యుత్ విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.
ఎంసీఏ విద్యార్థులకు ఓరియంటేషన్
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో ఎంసీఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు ట్రిపుల్ ఈ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రొఫెసర్ సాంబశివరావు మాట్లాడారు. ఎంసీఏ కోర్సు విధివిధానాలుతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఆయన వివరించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి చర్చించారు. కార్యక్రమంలో ఎం.జయంతి, ప్రిన్సిపాల్ సుధారాణి, సంధ్యారాణి, ప్రశాంతి, సురేష్‌రెడ్డి, హరీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జూనియర్ కళాశాల తనిఖీ
నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి పభుత్వ జూనియర్ కళాశాలను ఇంటర్ బోర్డ్ ప్రత్యేక అధికారి, డిప్యూటీ సెక్రటరీ భీమ్‌సింగ్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు శాతం 28 నుంచి 31 శాతం పెంపు, ఉత్తీర్ణత పెంచే విషయంపై అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. అధ్యాపకులు 90 రోజుల యాక్షన్ ప్లాన్ తయారుచేసి రాబోయే వార్షిక పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధం చేయాలని ఆదేశించారు. ఐఐటీ, జేఈఈ, నీట్‌లో మెరుగైన ఫలితం సాధించేలా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బాలాజీ, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
విజిలెన్స్ అధికారుల ప్రతిజ్ఞ


