లక్కు.. కొందరికే
లక్కీ డ్రా పారదర్శకంగా
నిర్వహించాం
నల్లగొండ : జిల్లాలో మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 154 షాపులకు 4,906 మంది దరఖాస్తులు సమర్పించగా.. సోమవారం హైదరాబాద్ రోడ్డులోని లక్ష్మీగార్డెన్స్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠి.. ప్రొహిబిషన్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సంతోష్, నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డితో కలిసి లక్కీ డ్రా నిర్వహించి దుకాణాలను కేటాయించారు. లక్కీడ్రా కోసం దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 11 గంటలకు లక్కీ డ్రా ప్రక్రియ ప్రారంభం కాగా.. మొదట నల్లగొండ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని వైన్స్‌లకు లక్కీ డ్రా నిర్వహించారు.
అంతా ఉత్కంఠ..
వైన్ షాపుల లక్కీ డ్రా నేపథ్యంలో లక్ష్మీగార్డెన్స్ ఆవరణలో అధికారులు మైక్‌లు ఏర్పాటు చేశారు. వేలాదిగా తరలివచ్చిన దరఖాస్తుదారులు లక్కీ డ్రా నిర్వహిస్తున్న సమయంలో ఉత్కంఠగా ఎదురుచూశారు. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు టెన్షన్ వాతావరణం కనిపించింది. షాపులు వచ్చిన వారు ఆనందంతో గంతులు వేయగా.. డ్రాలో షాపులు రాని వారు నిరాశతో వెనుదిరిగారు.
ఎక్కువగా సిండికేట్‌గానే..
ప్రభుత్వం మద్యం దుకాణాల దరఖాస్తుల రుసుం ప్రభుత్వం రూ.3 లక్షలకు పెంచడంతో ఈసారి సింగిల్‌గా దరఖాస్తు వేసేందుకు చాలా మంది వెనుకడుగు వేశారు. సిండికేట్‌గా ఏర్పడి దరఖాస్తులు సమర్పించారు.
● ఓ సిండికేట్ బృందం 150 షాపులకు టెండర్లు వేస్తే వారికి 4 షాపులు దక్కాయి.
● ఓ టీమ్ 27 మంది కలిసి సిండికేట్‌గా 27 షాపులకు దరఖాస్తులు వేస్తే వారికి 3 షాపులు దక్కాయి.
● మరో బృందం 21 షాపులకు దరఖాస్తులు సమర్పిస్తే 2 షాపులు దక్కాయి.
● జిల్లాలో అత్యధికంగా 154 దరఖాస్తులు వచ్చిన కనగల్ మండలం ధర్వేశిపురం వైన్స్.. తిప్పర్తికి చెందిన ఉయ్యాల రాములమ్మకు దక్కింది.
లక్కి డ్రా మద్యం షాపుల కేటాయింపును పారదర్శకంగా నిర్వహించాం. 154 షాపులకు 4906 దరఖాస్తులు రాగా దాని ద్వారా ప్రభుత్వానికి రూ.147.18 కోట్ల ఆదాయం వచ్చింది. జీహెచ్‌ఎంసీ తర్వాత నల్లగొండ జిల్లాలోనే అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. ఎంపిక ప్రక్రియ అంతా వీడియో రికార్డింగ్ చేశాం. దుకాణాల ఎంపిక నివేదికను ప్రభుత్వానికి పంపుతాం.
– కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఫ ప్రశాంతంగా ముగిసిన మద్యం దుకాణాల లక్కీ డ్రా
ఫ 154 షాపులకు 4,906 దరఖాస్తులు
ఫ కలెక్టర్ చేతుల మీదుగా లక్కీ డ్రా.. షాపుల కేటాయింపు
ఫ పెద్దఎత్తున తరలివచ్చిన దరఖాస్తుదారులు
లక్కు.. కొందరికే


