ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించొద్దు
కనగల్ : ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. సోమవారం ఆమె కనగల్ మండల పరిధిలోని పగిడిమర్రిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఇటీవల కురిసిన వర్షానికి ధాన్యం తడవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏపీఎం, సెంటర్ ఇన్‌చార్జికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పగిడిమర్రిలో ఐకేపీ కొనుగోలు కేంద్రం సరైన స్థలంలో లేనందున మరో ప్రదేశానికి మార్చాలని తహసీల్దార్ పద్మను ఆదేశించారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రోజూ ధాన్యం తేమశాతాన్ని పరీక్షించాలన్నారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కాంటాలు వేసిన వెంటనే మిల్లులకు పంపాలన్నారు. వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, డీఎస్‌ఓ వెంకటేశం, మేనేజర్ గోపికృష్ణ, తహసీల్దార్ పద్మ, ఏపీఎం మైసేశ్వరరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్‌రెడ్డి, ఆర్డీఏ మెంబర్ కుసుకుంట్ల రాజిరెడ్డి, గోలి నర్సిరెడ్డి, గోలి జగాల్‌రెడ్డి, సుంకిరెడ్డి కృష్ణారెడ్డి, సుంకిరెడ్డి కేశవరెడ్డి తదితరులు ఉన్నారు.
85 శాతం కొనుగోలు
కేంద్రాలు ప్రారంభించాం
నల్లగొండ : జిల్లాలో వానాకాలం సీజన్ ధాన్యం సేకరణకు ఇప్పటివరకు 85 శాతం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 41 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని.. ధాన్యం అమ్మిన రైతులకు రూ.16 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, డీఎస్‌ఓ వెంకటేష్, డీఎం గోపికృష్ణ, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, డీఏఓ శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించొద్దు
ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించొద్దు


