సాగుచేసే రైతులకు పట్టాలిస్తాం
21,190 కొత్త రేషన్‌కార్డులు
మంజూరు చేశాం
మిర్యాలగూడ : ‘భూమిని సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడమే లక్ష్యంగా ఉన్నాం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, ఎత్తిపోతల పథకాలు, ఇతర అభివృద్ధి పనుల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం అందించాం. ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాల అమలులో మిర్యాలగూడ డివి జన్‌ను ముందుంచాం’ అని సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ అన్నారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్‌గా బా ధ్యతలు చేపట్టిన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం ఆయన ‘సాక్షి’తో పలు అంశాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూముల సర్వేకు డివిజన్‌లోని తిరులమగిరి(సాగర్) మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా 14 గ్రామాల్లోని 245 సర్వే నెంబర్లలోని 4,174 ఎకరాల ప్రభుత్వ భూమిలో 4,856 మంది శివాయి జమ్మెదార్ లబ్ధిదారులను గుర్తించి 3,800 మందిని ఆన్‌లైన్‌లో నమోదు చేశాం. డివిజన్ పరిధిలో మొత్తం 18,459 భూభారతి దరఖాస్తులు రాగా ఇప్పటివరకు 6,200కు పైగా దరఖాస్తులను పరిష్కరించి మిర్యాలగూడ డివిజన్‌ను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపాం. సాదాబైనామా, అసైన్డ్, పీవోపీ దరఖాస్తులను కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం దామరచర్ల మండలంలో భూసర్వే నిర్వహిస్తున్నాం. వీర్లపాలెం, కేశవాపురం, కొండ్రపోల్‌లో సర్వే పూర్తి చేశాం. మిగిలిన గ్రామాల్లో కూడా సర్వే కొనసాగుతుంది. సర్వే పూర్తిగాకానే అందరికీ పట్టాలు అందిస్తాం.
దామరచర్ల మండలంలో చేపట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో భూములు, ఇళ్లు కోల్పోయిన 500 కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఇటీవల నియామక పత్రాలు అందించాం. ప్లాంట్ ప్రభావిత 262 మందికి, పోడు భూముల పట్టా కలిగిన 113 మందికి ఉద్యోగ నియామకాల కోసం ప్రతిపాదనలు పంపించాం. నెల్లికల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా రైతులు కోల్పోయిన 17.28 ఎకరాల భూమికి ఎకరాకు రూ.24లక్షల చొప్పున పరిహారం చెల్లించాం. బొత్తలపాలెం, వీర్లపాలెం, దున్నపోతులగండి ఎత్తిపోతల పతకాల నిర్మాణంలో భూములు కోల్పోయిన వారితోపాటు అడవిదేవులపల్లి మండల చిట్యాల టెయిల్‌పాండ్ నీటి ద్వారా నిర్వాసితులవుతున్న వారికి పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు పంపించాం. మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారి –167 వెడల్పులో భాగంగా ఆస్తి కోల్పోయిన 254 మందికి రూ.54 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు 180 మందికి రూ.37 కోట్లు వారి అకౌంట్లలో జమ చేశాం.
మిర్యాలగూడ మండలంలోని లక్ష్మీపురంలో 44 మందికి, అనుముల మండలంలోని హజారిగూడెంలో 85 మందికి, తిరుమలగిరి(సాగర్) మండలంలోని బోయగూడెంలో 195 మందికి, సిలిగాపురంలో 120 మందికి, కొంపల్లిలో 120 మందికి, యల్లాపురంలో 115 మందికి, మిర్యాలగూడలో 90 మందికి ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశాం. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సౌకర్యార్థం, ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు హైదరాబాద్ తరువాత రాష్ట్రంలోనే తొలిసారిగా మిర్యాలగూడలో సాండ్ బజార్ ప్రారంభించాం.
మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా వచ్చిన వివిధ దేశాల పోటీదారుల నాగార్జునసాగర్ పర్యటనను విజయవంతంగా నిర్వహించాం. ఉమ్మడి జిల్లాలో నల్లగొండ తరువాత మిర్యాలగూడలో జంతువుల కుటుంబ నియంత్రణ కేంద్రం పనులకు శంకుస్థాపన చేశాం. మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూలు తదితర అంశాల్లో డివిజన్‌కు రాష్ట్రంలో మంచి గుర్తింపు లభించింది.
ఫ నిర్వాసితులకు పరిహారం అందించాం
ఫ పథకాల అమలులో డివిజన్‌ను ముందుంచాం
ఫ పేదలకు ఇళ్ల పట్టాలిచ్చాం
ఫ ‘సాక్షి’తో మిర్యాలగూడ
సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్
ఫ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి
డివిజన్ పరిధిలో మొత్తం 21,190 కొత్త రేషన్‌కార్డుల మంజూరుతోపాటు 26,322 పేర్లను కార్డులో కొత్తగా చేర్చాం. ఖాళీగా ఉన్న 30 రేషన్ దుకాణాలకు డీలర్లను నియమించడంతోపాటు 18 దుకాణాలను ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. ఇటీవల కొన్ని దుకాణాలను కొత్తగా ప్రారంభించాం. డివిజన్‌లో 2,051 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.20.53కోట్లు మంజూరు చేశాం. డివిజన్ పరిధిలోని పది భవిత కేంద్రాలను ఆధునీకరించాం. వీటిలో ప్రస్తుతం 200 మంది దివ్యాంగ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
సాగుచేసే రైతులకు పట్టాలిస్తాం


