దేవరకొండ పోలీస్‌స్టేషన్ 125 వసంతాల వేడుక
కొండమల్లేపల్లి : దేవరకొండ పోలీస్‌స్టేషన్ 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీస్‌స్టేషన్ పనితీరు, వివిధ విభాగాలు, ఆయుధాలు, సాంకేతిక పరికరాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మౌనిక మాట్లాడుతూ విద్యార్థులకు పోలీసు వ్యవస్థపై అవగాహన కల్పించడం, పోలీసులకు–ప్రజలకు మధ్య సత్సంబంధాలు పెంపొందించడంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు ఎంతో ఉపకరిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్‌స్టేషన్ సిబ్బంది, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


