స్టేట్‌మెంట్ రికార్డు కోసం బెంచ్ దిగొచ్చిన జడ్జి
రామన్నపేట: నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తి వద్దకు నేరుగా జడ్జి వెళ్లి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. రామన్నపేట కోర్టులో సోమవారం ఈ సంఘటన జరిగింది. మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన అంతటి లింగస్వామి 2019లో నమోదైన ఓ కేసు విషయంలో స్టేట్‌మెంట్ ఇవ్వడానికి సోమవారం కోర్టుకు వచ్చాడు. పక్షవాతం రావడంతో అతడు నడవలేని స్థితిలో ఉన్నాడు. కుటుంబ సభ్యులు అతడిని కోర్టుకు కారులో తీసుకొచ్చారు. పరిస్థితిని గమనించిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష కారులో ఉన్న లింగస్వామి వద్దకు వెళ్లి విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.
స్థానిక ఎన్నికల్లో
నాలుగు స్తంభాలాట
నల్లగొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు స్తంభాలాట మొదలైందని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిలకర రవికుమార్ అన్నారు. సోమవారం నల్లగొండలోని ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు దీటుగా తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ పురుడు పోసుకుందని తెలిపారు. యువతన రాజకీయ నాయకులుగా తయారుచేసే ఏకైక పార్టీ తమదేనన్నారు.


