బైక్‌పై వెళ్తూ వాగులో పడిపోయిన వ్యక్తి
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలంలోని తిమ్మాపురం–సంగెం రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కోడూరు వద్ద వాగుపై వంతెన నిర్మాణం జరగాల్సి ఉంది. అయితే ఇంతవరకు వంతెన నిర్మాణ పనులు మొదలు కాలేదు. దీంతో వర్షాలు కురిసినప్పుడు వాగు పొంగి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు పొంగి ప్రవహిస్తోంది. సోమవారం ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తూ కోడూరు వద్ద వాగు దాటుతుండగా.. అదుపుతప్పి వాగులో పడిపోయాడు. వంతెన నిర్మాణ పనులను తొందరగా పూర్తిచేయాలని ప్రయాణికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
బైక్‌పై వెళ్తూ వాగులో పడిపోయిన వ్యక్తి


