నేడు మద్యం దుకాణాలకు లక్కీడ్రా | - | Sakshi
Sakshi News home page

నేడు మద్యం దుకాణాలకు లక్కీడ్రా

Oct 27 2025 8:44 AM | Updated on Oct 27 2025 8:44 AM

నేడు

నేడు మద్యం దుకాణాలకు లక్కీడ్రా

నల్లగొండ: జిల్లాలో మద్యం దుకాణాలకు సోమవారం లక్కీ డ్రా తీయనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా ఎకై ్సజ్‌ అధికారులు హైదరాబాద్‌ రోడ్డులోని లక్ష్మీగార్డెన్స్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు టెండర్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించి మొత్తం 4,906 టెండర్లు వచ్చాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సమక్షంలో దుకాణాల వారీగా లక్కీ డ్రా తీసి విజేతలకు షాపులు కేటాయించనున్నారు.

ఫీజు బకాయిలు విడుదల చేయాలి

నల్లగొండ: ఇంజనీరింగ్‌, డిగ్రీ, పీజీ చదివే విద్యార్థుల ఫీజుల బకాయిలు సుమారు రూ.5 వేల కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం నల్లగొండలోని సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీజీ కోర్సుల్లో సీట్లు పొందినవారికి, ఇతర దేశాల్లో ఉద్యోగాలు వచ్చిన వారికి కూడా ఆయా కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ సమావేశంలో కారింగ్‌ నరేష్‌గౌడ్‌, కన్నబోయిన రంజిత్‌యాదవ్‌, జక్కల పరమేష్‌, ఆవుల ప్రశాంత్‌, సతీష్‌, పృథ్వీరాజ్‌, అంద రాకేష్‌, ఎర్రబోయిన గణేశ్‌, నిఖిల తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి

నల్లగొండ: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల విషయంలో నష్టం కలిగించేలా ఉన్న అడ్వకసీ, ఇతర సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తొంట సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ భవనంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను ఏకం కావాలన్నారు. అనంతరం నూతనంగా పదోన్నతి పొందిన ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులకు సన్మానించారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి పెంట అంజయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లు చాగంటి ప్రభాకర్‌, సూర్యదేవర దానయ్య, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు నరసింహనాయక్‌, జిల్లా అధ్యక్షుడు ఆరెకంటి వెంకటయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నూనె విష్ణు, ఉపాధ్యక్షుడు శ్రీపతి యాదయ్య, జిల్లా కార్యదర్శి దొడ్డి కై లాస్‌, జిల్లా కోశాధికారి రాసమల్ల శేఖర్‌, వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

యాదగిరి క్షేత్రంలో కోలాహలం

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కోలాహలం నెలకొంది. కార్తీకమాసం, ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు ఉదయం నుంచే స్వామివారి దర్శనం కోసం వేలాది తరలివచ్చారు. వేకుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. గర్భాలయంలో కొలువుదీరిన స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి, కార్తీక దీపారాధనన చేశారు.

నేడు మద్యం దుకాణాలకు లక్కీడ్రా1
1/2

నేడు మద్యం దుకాణాలకు లక్కీడ్రా

నేడు మద్యం దుకాణాలకు లక్కీడ్రా2
2/2

నేడు మద్యం దుకాణాలకు లక్కీడ్రా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement