43 వసంతాలకు అపూర్వ కలయిక
డిండి : వారంతా 43 ఏళ్ల క్రితం ఒకే స్కూల్‌లో పదో తరగతి చదువుకున్న చిన్ననాటి స్నేహితులు. ఆత్మీయ సమ్మేళనం పేరిట ఆదివారం ఒకే వేదికపై కలిశారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. వీరే డిండి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1981–82 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు. 43 వసంతాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న వీరంతా ఒకరినొకరు ఆప్యాయంగా ఆత్మీయ ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అప్పట్లో తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గుర్తుచేసుకుని ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో నరేందర్‌రావు, శ్రీనివాసులు, నగేష్, మధుసూదనాచారి, లక్ష్మీనర్సింహ, రాజేందర్‌రెడ్డి, రాములు, ఏసోబు, తిర్పతయ్య, రాజేశ్వరి, అరుణమ్మ, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.


