రేణుకా ఎల్లమ్మకు కుంకుమ పూజలు
కనగల్: మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా ఆదివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. శివుడి విగ్రహం వద్ద ప్రమిదలు వెలిగించి దీపారాధన చేశారు. పుట్టలో పాలు పోసి నాగ పడగలకు మొక్కుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చీదేటి వెంకట్‌రెడ్డి దంపతులు, ఈఓ అంబటి నాగిరెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు తేలుకుంట్ల చంద్రశేఖర్, ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య నరసింహ, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు కొత్తమాస్ ప్రభాకర్ పాల్గొన్నారు.


