ఫ వైన్స్ టెండర్లకు నేడు ఆఖరు
నల్లగొండ : మద్యం దుకాణాలకు రెండు రోజుల్లో 33 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 18వ తేదీతో మద్యం టెండర్ల గడువు ముగియగా.. ప్రభుత్వం 23వ తేదీ వరకు గడువు పొడిగించిన విషయం తెలిసిందే. కానీ ఈ రెండు రోజుల్లో అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రాలేదు. దరఖాస్తులకు గురువారం ఆఖరి గడువు ఉంది. అయితే ఇప్పటి వరకు మొత్తం దరఖాస్తులు 4,653 రాగా.. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.139.59 కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో దరఖాస్తుల ద్వారా రూ.141.44 ఆదాయం రాగా ఇప్పుడు తక్కువగానే వచ్చింది. గురువారం మరో 62 దరఖాస్తులు గతంలో వచ్చిన ఆదాయాన్ని చేరుకుంటుంది.
ఉన్నత లక్ష్యాలు ఏర్పర్చుకోవాలి
కొండమల్లేపల్లి : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పర్చుకోవాలని డీఈఓ భిక్షపతి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కేజీబీవీని ఆయన సందర్శించి విద్యార్థులతో మాట్లాడి మెనూ వివరాలతోపాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే పదవ తరగతి పరీక్షలకు ప్రణాళికబద్ధంగా సిద్ధమవ్వాలని, ఉత్తమ మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ఎస్‌ఓ కత్తుల సరళ, ఉపాధ్యాయులు ఉన్నారు.
30న విద్యా సంస్థల బంద్
నల్లగొండ టౌన్ : పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు తెలిపారు. బుధవారం నల్లగొండలోని ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాయని అన్నారు. అన్ని విద్యార్థి సంఘాలు పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, కుర్ర సైదానాయక్, కోరె రమేష్, ముస్కు రవీందర్, మారుపాక కిరణ్, కర్రెం రవి, ప్రసన్న, మూడవత్ జగన్‌నాయక్, జగదీష్, సైఫ్ నవదీప్ తదితరులు పాల్గొన్నారు.
నేత్రపర్వం.. నృత్యోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరి పట్టణంలోని వైకుంఠద్వారం వద్ద బుధవారం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేశాయి. భరతనాట్యం, కూచిపూడి నృత్యాలను కళాకారులు అద్భుతంగా ప్రదర్శించి భక్తులను అలరించారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఎయిమ్స్ నూతన డైరెక్టర్ నేడు బాధ్యతల స్వీకరణ
బీబీనగర్: ఎయిమ్స్ నూతన డైరెక్టర్ అమితా అగర్వాల్ గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో డైరెక్టర్ పని చేసిన వికాస్‌భాటియా మే నెలలో ఢిల్లీ ఎయిమ్స్‌కు బదిలీ అయ్యారు.ఆయన స్థానంలో ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ అహెంతా శాంతాసింగ్‌ను ఇంచార్జిగా నియమించారు. కాగా పూర్తిస్థాయి డైరెక్టర్‌గా లక్నోలోని సంజయ్‌గాంధీ పోసు్ట్రగాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్‌లో సీనియర్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న అమితా అగర్వాల్‌ను బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నేడు బాధ్యతలు స్వీకరిస్తారని ఎయిమ్స్ అధికారులు తెలిపారు.
రెండు రోజుల్లో 33 దరఖాస్తులు
రెండు రోజుల్లో 33 దరఖాస్తులు