
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
నల్లగొండ టూటౌన్ : ఎమ్మెల్సీగా తాను ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలోని చిన్న వెంకట్‌రెడ్డి ఫంక్షన్ హాల్‌లో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కాళం నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో శ్రీపాల్‌రెడ్డి మాట్లాడారు. 53 సంవత్సరాల క్రితం పంచాయతీరాజ్ ఉపాధ్యాయుడి ఆత్మగౌరవం కాపాడడం కోసం, సగటు ఉపాధ్యాయుడి జీవన ప్రమాణం పెంచడం కోసం ఏర్పడిన పీఆర్‌టీయూ నేడు 80 వేల మంది సభ్యులతో భారతదేశంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ సంఘంగా అవతరించిందన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు, 317 ఉద్యోగుల పరస్పర బదిలీలు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు, కేజీబీపీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం లాంటివి సాధించామన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుల్లం దామోదర్‌రెడ్డి, సుంకరి భిక్షంగౌడ్, మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు తిరందాసు సత్తయ్య, పేరి వెంకట్‌రెడ్డి, జగన్మోహన్ గుప్తా, సోమిరెడ్డి, నివాస్‌రెడ్డి, కోమటరెడ్డి నర్సింహారెడ్డి, గాదె వెంకట్‌రెడ్డి, కిరణ్ కుమార్, వెంకట్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, సీతారాంచందర్ రావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి