ఆరు మిల్లుల్లో సీఎంఆర్‌ ధాన్యం మాయం | - | Sakshi
Sakshi News home page

ఆరు మిల్లుల్లో సీఎంఆర్‌ ధాన్యం మాయం

Oct 23 2025 6:27 AM | Updated on Oct 23 2025 6:27 AM

ఆరు మ

ఆరు మిల్లుల్లో సీఎంఆర్‌ ధాన్యం మాయం

మిల్లుల్లో కనిపించని ధాన్యం

చిట్యాలలోని వరలక్ష్మి మిల్లులో 59,538.52 క్వింటాళ్లు, నల్లగొండలోని రామ్‌లక్ష్మణ్‌ మిల్లులో 78,110.70 క్వింటాళ్లు, మునుగోడులోని మురళి మనోహర ఆగ్రోఫుడ్‌ ప్రొడక్ట్‌స్‌ మిల్లులో 4,500 క్వింటాళ్లు, నల్లగొండలోని ఆర్జాలబావిలో ఉన్న సుమాంజలి మిల్లులో 67,662.11 క్వింటాళ్లు, ఆర్జాలబావిలోని గౌతమి ఇండస్ట్రీస్‌లో 1,59,803.92 కింటాళ్లు, నల్లగొండలోని కనకామహాలక్ష్మి మిల్లులో 80,260.59 క్వింటాళ్ల ధాన్యం నిల్వ లేదని విచారణ బృందం తనిఖీలో తేలింది.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రభుత్వానికి సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) కింద ఇవ్వాల్సిన ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించారు. 4,49,875 క్వింటాళ్ల ధాన్యానికి సంబంధించి సీఎంఆర్‌ కింద బియ్యం ఇవ్వకుండా కాకినాడ పోర్టుకు తరలించారని వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు జిల్లాలోని ఆరు మిల్లులపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అదనపు కలెక్టర్‌ ఏర్పాటు చేసిన విచారణ బృందం ఆరు మిల్లుల్లో అక్రమాలు జరిగింది వాస్తవమే అని తేల్చి చెప్పింది. ఆ నివేదికను బృందం ఉన్నతాధికారులకు అందించింది. నెలలు గడుస్తున్నా.. సీఎంఆర్‌ ధాన్యాన్ని మింగేసిన వారిపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తోంది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందిన ఫిర్యాదు

2022–23 యాసంగి సీజన్‌కు సంబంధించి చిట్యాలలోని వరలక్ష్మి, నల్లగొండలోని రామ్‌లక్ష్మణ్‌, మునుగోడులోని మురళీమనోహర్‌ ఆగ్రోఫుడ్‌, నల్లగొండ ఆర్జాలబావి సమీపంలోని సుమాంజలి, గౌతమి ఇండస్ట్రీస్‌, నల్లగొండలోని కనకమహాలక్ష్మి పార్‌బాయిల్డ్‌ మిల్లులు ప్రభుత్వ కొనుగోలు సంస్థల నుంచి ధాన్యం తీసుకుని సీఎంఆర్‌ బియ్యాన్ని ఇవ్వలేదని జూన్‌ 25వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సోమారపు శ్రీదేవి ఫిర్యాదు చేశారు. దీంతో పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ దానిపై విచారణ చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ విచారణకు కమిటీ వేశారు. అందులో డీఎస్‌ఓ, డీఎంతోపాటు నల్లగొండ ఆర్డీఓ, నల్లగొండ లీగల్‌ మెట్రాలజీ అధికారి, తహసీల్దార్‌, నల్లగొండ సీవిల్‌ సప్లయ్‌ ఆర్‌ఐల ఆధ్వర్యంలో ఈ ఆరు మిల్లుల్లో తనిఖీలు చేశారు. మిల్లులు అక్రమాలకు పాల్పడింది వాస్తవమేనని విచారణ కమిటీ నిర్ధారించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఆగస్టు 30వ తేదీన నివేదిక అందించారు.

చర్యలు చేపట్టడంలో విఫలం..

ఆరు మిల్లులు అక్రమాలు జరిగినది వాస్తవమే అని విచారణ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందింది. 4,49,875 క్వింటాళ్ల ధాన్యం ఎక్కడ పోయిందో కూడా తేల్చలేదు. కాకినాడ పోర్టుకు తరలించారంటూ ఫిర్యాదు అందింది. అయిని అక్రమాలకు పాల్పడ్డ మిల్లులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కాజేసి అక్రమాలకు పాల్పడ్డ మిల్లులపై జిల్లా యంత్రాంగం తీరు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికై నా అధికార యంత్రాంగం స్పందించి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును రికవరీ చేయాల్సిన అవసరం ఉంది.

ఫ 4,49,875 క్వింటాళ్లు పక్కదారి పట్టినట్లు తేల్చిన అధికారుల కమిటీ

ఫ ప్రభుత్వానికి అందిన నివేదిక

ఫ మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలో

మీనమేషాలు

ఆరు మిల్లుల్లో సీఎంఆర్‌ ధాన్యం మాయం
1
1/1

ఆరు మిల్లుల్లో సీఎంఆర్‌ ధాన్యం మాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement