
ధాన్యం తడవకుండా చూసుకోవాలి
రామగిరి(నల్లగొండ) : వర్షానికి ధాన్యం తడవకుండా చూసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం నల్లగొండ మండలం ముషంపల్లి, జికే అన్నారం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరిపడా తేమ శాతం ఉంటే ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలన్నారు. ఒకవేళ తేమ, తాలు, తరుగు కారణాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఉండాల్సి వస్తే వర్షానికి తడవకుండా అవసరమైన టార్పాలిన్లు, ఇతర అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని చెప్పారు. అనంతరం వెంకటసాయి రైస్ మిల్లును తనిఖీ చేసి ధాన్యం ఎగుమతి, దిగుమతులను వేగవంతం చేయాలని, లోడింగ్ అన్‌లోడింగ్‌లో జాప్యం చేయవద్దని సూచించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, ప్రత్యేక అధికారి నాగేశ్వరరావు, మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ, జిల్లా పారసరఫరాల అధికారి వెంకటేష్, డీఆర్డీఓ శేఖర్‌రెడి, సహకార అధికారి పత్యానాయక్, కనగల్ తహసీల్దార్ పద్మ ఉన్నారు.
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
నల్లగొండ : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ధాన్యం సేకరణపై బుధవారం ఆమె వివిధ శాఖల అధికారులతో నల్లగొండలోని తన ఛాంబర్‌లో సమావేశమై మాట్లాడారు. కేంద్రాల్లో ధాన్యం నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేసి, తేమను చూసి సరైన ప్రమాణాలతో ఉంటే వెంటనే కాంటావేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి