
అన్నదాత ఆగమాగం
మిర్యాలగూడ : బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో రోజూ వర్షం కురుస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడుస్తోంది. ఇక కోతకొచ్చిన వరిచేలు నేలవాలి రైతులకు నష్టాన్ని మిగిల్చుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిగుబడి తగ్గే అవకాశం
వర్షాల కారణంగా ఆయకట్టులో వరి చేలకు నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం ఆయకట్టులో వరి చేలు పొట్ట, గింజ పాలుపోసుకునే దశలో ఉన్నాయి. ఈ సమయంలో వర్షాలతో పంటకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే రైతులు ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. పంట కోతకు వచ్చే సమయంలో ఈ అకాల వర్షాలు అన్నదాతను నట్టేట ముంచాయి. ఇప్పటికే ఈనిన చేలలో వరి కంకులకు ఉన్న గింజలు రాలిపోయాయి. దీనివల్ల పూర్తిగా దిగుబడి తగ్గే అవకాశం కనిపిస్తోంది.
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న
వ్యవసాయాధికారులు..
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటల వివరాలను సేకరించేందుకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. గ్రామాల్లో ఉన్న ఏఈఓల ద్వారా వివరాలను సేకరిస్తున్నారు. ఏయే గ్రామాల్లో పంట ఎన్ని ఎకరాల్లో నేలకొరిగిందనే విషయాలను రైతుల ద్వారా తెలుసుకుంటున్నారు. రైతుల వివరాలను, ఎన్ని ఎకరాల్లో నష్టపోయిందో రికార్డుల్లో నమోదు చేసుకుంటున్నారు. వరి పొలాలు పాలు పోసుకునే దశలో ఉంటే నేలకొరిగిన అంతగా నష్టం ఉండదని, గింజలు పోసుకోని ఉన్నప్పుడే నేలకొరిగితే నష్టం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.
ఫ వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం
ఫ ఆయకట్టులో నేలవాలుతున్న వరిచేలు
ఫ ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులు

అన్నదాత ఆగమాగం

అన్నదాత ఆగమాగం