మర్రిగూడ కేజీబీవీకి కార్పొరేట్ హంగులు
కేజీబీవీలో కొత్తగా నిర్మించిన గదులు
మర్రిగూడ : మర్రిగూడ కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలకు కార్పొరేట్ స్థాయిలో వసతులు సమకూరాయి. 14 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ పాఠశాలలో వసతుల లేమి, ఇరుకు గదుల్లో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడేవారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తన తల్లి పేరుమీద ఏర్పాటు చేసిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో రూ.1.50 కోట్ల వ్యయంతో పాఠశాలలో అన్ని హంగులు కల్పించారు. నూతన నిర్మాణాలను ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్‌పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి ఆదివారం ప్రారంభించనున్నారు.
అందుబాటులోకి అన్ని సదుపాయాలు
పాఠశాలలో 9 అదనపు గదులు, 36 బాత్‌రూమ్‌లు, ప్రహరి గోడ, పాత బాత్‌రూమ్‌ల ఆధునీకరణ, రెండెకరాల ఆటస్థలంలో 300 ట్రిప్పుల మట్టిపోయడం, 1.5 లక్షల లీటర్ల సెప్టిక్ ట్యాక్ నిర్మాణం, 60 వేల లీటర్ల ఇంకుడు గుంత, 10 వేల లీటర్ల వాటర్ ట్యాంక్ ఏర్పాటు, బోర్ మోటార్, 300 లీటర్ల గీజర్, వాష్ ఏరియా నిర్మాణం, ఇన్వర్టర్ ఏర్పాటు, 326 మంది విద్యార్థులకు నూతన బెడ్స్, దోమలు రాకుండా యుటీవీసీ విండోస్ మెష్‌లు, వంట గదిలోకి నేరుగా మిషన్ భగీరథ నీటి కనెక్షన్, కొత్తగా డ్రెయినేజీ పైపులైన్, పాఠశాల ఆవరణలో ఫ్లడ్ లైట్ల ఏర్పాటు, సెక్యూరిటీ రూమ్ నిర్మాణాన్ని తదితర సౌకర్యాలు కల్పించారు.
ఫ రూ.1.50 కోట్లతో సదుపాయాలు
ఫ సుశీలమ్మ ఫౌండేషన్ చేయూత
ఫ నేడు ప్రారంభించనున్న
ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి


