తక్కువ ధరకు కొంటున్నారు
సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయకపోడంతో రైతులంతా తమ పత్తిని వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. జిల్లా జిన్నింగ్ మిల్లుల్లో క్వింటాకు రూ.6 వేలకే కొంటున్నారు. దీంతో కేంద్రాల ఏర్పాటు చేసిన తర్వాతే అమ్ముదామని పత్తిని నిల్వ చేసుకున్నాను.
– ఎంపల వెంకన్న, పత్తి రైతు సింగారం,
మునుగోడు మండలం
వ్యాపారులు మద్దతు ధర చెల్లించకుండా రైతులను ముంచుతున్నారు. మద్దతు ధర కాకుండా క్వింటాకు రూ.6 వేలు కూడా ఇవ్వకుండా రూ.5,500లకే అడుగుతున్నారు. సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాతే పత్తి అమ్మాలని నిర్ణయించుకున్నాను.
– మామిడి నాగయ్య, పత్తిరైతు, తిప్పర్తి
రైతులు తొందరపడి ముందే పత్తిని వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవద్దు. దీపావళి తర్వాత సీసీఐ కేంద్రాలను ప్రారంభించున్నారు. 8 నుంచి 12 వరకు తేమశాతం ఉండేలాపత్తిని ఆరబెట్టి సీసీఐ కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర రూ.8,100 పొందాలి.
– పాల్వాయి శ్రవణ్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి
తక్కువ ధరకు కొంటున్నారు
తక్కువ ధరకు కొంటున్నారు


