కేజీబీవీల్లో నాణ్యమైన విద్యనందించాలి
నల్లగొండ: కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లోని విద్యార్థినులకు నాణ్యమైన విద్యనందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్‌లో మండల ప్రత్యేక అధికారులు, కేజీబీవీల ప్రత్యేక అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేజీబీవీల్లో నాణ్యమైన విద్య, భోజనం, వసతుల విషయంలో ఎస్‌ఓలు రాజీ పడొద్దన్నారు. జిల్లాలో 27 కేజీబీవీల్లో ప్రహరీలు, టాయ్‌లెట్లు, సంపులు, అదన తరగతుల నిర్మాణాలను చేపట్టేందుకు గుర్తించామన్నారు. సంబంధిత అధికారులు అంచనాలను రూపొందించి కలెక్టరేట్‌కు పంపితే ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు నారాయణ్ అమిత్, జె.శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలప్రసాద్, డీఈఓ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


