ధాన్యం కేంద్రాల్లో సమస్యలపై కలెక్టరేట్‌లో కంట్రోల్ రూ
నల్లగొండ: ధాన్యం సేకరణలో రైతులు సమస్యల పరిష్కారానికి నల్లగొండ కలెక్టరేట్‌లో గురువారం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్ 9281423653కు రైతులు, రైస్ మిల్లర్లు ఫిర్యాదులు చేయవచ్చునన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించిన సమస్యలపై కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు, మిల్లుల్లో అన్‌లోడింగ్ సమస్యలు, కొనుగోలు కేంద్రాల్లోని సమస్యలు కంట్రోల్ రూమ్‌కు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఫోన్ ద్వారా తెలిలపాలన్నారు. ఈ కంట్రోల్ రూమ్‌లో అన్ని శాఖల సిబ్బంది ఉంటారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు నారాయణ్ అమిత్, జె.శ్రీనివాస్, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, డీఎస్‌ఓ వెంకటేశం, డీఎం గోపికృష్ణ, జెడ్పీఈసీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


