రామ్మూర్తి యాదవ్‌తో అనుబంధం మరువలేనిది | - | Sakshi
Sakshi News home page

రామ్మూర్తి యాదవ్‌తో అనుబంధం మరువలేనిది

Oct 27 2025 9:04 AM | Updated on Oct 27 2025 9:04 AM

రామ్మూర్తి యాదవ్‌తో అనుబంధం మరువలేనిది

రామ్మూర్తి యాదవ్‌తో అనుబంధం మరువలేనిది

త్రిపురారం: చలకుర్తి మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్‌తో తన అనుబంధం మరువలేనిదని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన రామ్మూర్తి యాదవ్‌ విగ్రహాన్ని ఆదివారం నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కెతావత్‌ శంకర్‌నాయక్‌, రామ్మూర్తి యాదవ్‌ కుటుంబ సభ్యులతో కలిసి జానారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కర్లకంటిగూడెంలో ఉన్న ఎల్‌–10 లిప్టు ఇరిగేషన్‌కు రామ్మూర్తి యాదవ్‌ పేరు పెడుతున్నట్లు గ్రామస్తుల సమక్షంలో జానారెడ్డి ప్రకటించారు. వరద కాల్వకు కూడా రామ్మూర్తి యాదవ్‌ పేరు పెట్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి మాట్లాడుతూ.. రామ్మూర్తి యాదవ్‌ జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. గుండెబోయిన కోటేష్‌ యాదవ్‌, గుండెబోయిన నగేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జిల్లా మహిళ అధ్యక్షురాలు గోపగాని మాధవి, మండల అధ్యక్షుడు ముడిమళ్ల బుచ్చిరెడ్డి, అనుముల శ్రీనివాస్‌రెడ్డి, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు సోమయ్య, బహునూతుల నరేందర్‌, మర్ల చంద్రారెడ్డి, పెద్దబోయిన శ్రీనివాస్‌, గుండెబోయిన వెంకటేశ్వర్లు, అనుముల వెంకట్‌రెడ్డి, బహునూతుల శ్రీనివాస్‌, మాజీ ఎంపీటీసీ అంబటి రాము, నాయిని సంతోష్‌కుమార్‌, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రామ్మూర్తి యాదవ్‌ సేవలు మరువలేనివి

చలకుర్తి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్‌ సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌యాదవ్‌ అన్నారు. పెద్దదేవులపల్లి గ్రామంలో రామ్మూర్తి యాదవ్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వారు హాజరై నివాళులర్పించారు. వారి వెంట ట్రైకార్‌ మాజీ చైర్మన్‌ ఇస్లావత్‌ రాంచందర్‌ నాయక్‌, త్రిపురారం మాజీ సర్పంచ్‌ అనుముల శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ గుండెబోయిన వెంకటేశ్వర్లు, అనుముల శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ఫ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement