గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకుల అరెస్టు
మిర్యాలగూడ అర్బన్: గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను ఆదివారం మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని తాళ్లగడ్డ మల్లెతోట సమీపంలో కొందరు యువకులు గంజాయి సేవిస్తున్నారనే విస్వసనీయ సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లగా.. పున్‌రెడ్డి కార్తీక్‌రెడ్డి, గొర్రెల సాయిశ్రీరామ్, బంటు నగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారికి టీహెచ్‌సీ కిట్లతో పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చిందని ఎస్‌ఐ తెలిపారు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
కల్వర్టుపై వరద నీటిలో
అదుపుతప్పిన కారు
పెద్దవూర: కల్వర్టుపై నుంచి ప్రవహిస్తున్న వరద నీటిలో కారు అదుపుతప్పి కిందికి జారిపోయింది. ఈ ఘటన ఆదివారం పెద్దవూర మండలంలోని తుంగతూర్తి గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతూర్తి గ్రామంలో ఓ వివాహానికి హాజరయ్యేందుకు బంధువులు కారులో వచ్చారు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని కల్వర్టుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. కొంచెం లోతులోనే నీరు ప్రవహిస్తుందని తప్పుగా అంచనా వేసిన డ్రైవర్ కారును ముందుకు పోనిచ్చాడు. కల్వర్టు సగానికి పోగానే వరద ప్రవాహానికి కారు అదుపుతప్పి కిందికి జారిపోయింది. గమనించిన గ్రామస్తులు కారులో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చారు. పది మందికి పైగా ప్రయత్నించినా కల్వర్టు కింది నుంచి కారును పైకి తీసుకురాలేకపోయారు. దీంతో ట్రాక్టర్‌కు తాళ్లను బిగించి అతికష్టం మీద బయటకు తీసుకొచ్చారు.


