ముగిసిన ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు
భువనగిరి: భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో శనివారం ప్రారంభమైన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఆఖరి రోజు నాకౌట్ మ్యాచ్‌లతో పాటు సెమీఫైనల్, ఫైనల్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో ఉమ్మడి వరంగల్ జిల్లా, ద్వితీయ స్థానంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, తృతీయ స్థానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు నిలిచాయి. విజేతలకు కళాశాల ప్రిన్సిపాల్ కరుణాకర్‌రెడ్డి ట్రోఫీలు అందజేశారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన 15 మంది క్రీడాకారులను మధ్యప్రదేశ్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ పోటీల రాష్ట్ర పరిశీలకుడు ప్రసాద్, కళాశాల పరిశీలకుడు శ్రీనివాస్‌రెడ్డి, అధ్యాపకులు అంజనేయులు, నర్సింహ, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
ఫ ప్రథమ స్థానంలో వరంగల్, ద్వితీయ స్థానంలో రంగారెడ్డి జిల్లా జట్లు
ఫ జాతీయ స్థాయి పోటీలకు
15 మంది ఎంపిక
ముగిసిన ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు
ముగిసిన ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు


