రాజకీయాల్లో అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోంది
నల్లగొండ: రాజకీయాలపై ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో చైతన్యం లేకనే అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్(టీఆర్‌ఎల్డీ) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌కుమార్ అన్నారు. టీఆర్‌ఎల్డీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రథయాత్ర ఆదివారం నల్లగొండకు చేరుకుంది. ఈ సందర్భంగా క్లాక్‌టవర్ సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 98శాతం బడుగు వర్గాలే ప్రాణాలు వదిలారన్నారు. అయినా బహుజన తెలంగాణ రాలేదన్నారు. హరీష్‌రావు, సంతోష్‌రావు అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు సంపాదించారని కల్వకుంట్ల కవిత ఆరోపించిందని గుర్తుచేశారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఆయనకు వెన్నుపోటు పొడిచారన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే బడుగు, బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులు, ఇతర పార్టీల నుంచి బీఫారం లభించని వారు తనను సంప్రదిస్తే టీఆర్‌ఎల్డీ పార్టీ నుంచి బీఫారంలు ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. నిరుద్యోగులకు వ్యక్తిగత రుణాలు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, పంటల బీమా పథకాన్ని తక్షణమే అమలు చేయాలని, మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు ముద్దము మల్లేష్, బండిపాడు జానయ్య, నర్సింగ్ రావు, సుధాకర్, బీరప్ప, కోరే సాయిరాం పాల్గొన్నారు.
జాతీయ రహదారిపై వాహనాల బారులు
చౌటుప్పల్ : 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. వీకెండ్‌తో పాటు పెద్ద సంఖ్యలో వివాహాలు, ఇతర శుభకార్యాలు ఉండడంతో హైదరాబాద్–విజయవాడ మార్గంలో వాహనాలు బారులుదీరాయి. రద్దీ కారణంగా చౌటుప్పల్ పట్టణంలోని తంగడపల్లి చౌరస్తా జంక్షన్‌ను పోలీసులు మూసివేశారు. దీంతో వాహనదారులు, స్థానికులు ఆర్టీసీ బస్‌స్టేషన్, వలిగొండ క్రాస్‌రోడ్డుల మీదుగా రాకపోకలు కొనసాగించాల్సి వచ్చింది. వాహనాల రద్దీకి వారాంతపు సంత జనం సైతం తోడుకావడంతో మరింత గజిబిజి ఏర్పడింది.
గూడూరు టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ
బీబీనగర్: బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. ఉదయం భువనగిరి వైపు, సాయంత్రం హైదరాబాద్ వైపు వాహనాలు బారులుదీరాయి.
ఫ తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ
రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌కుమార్
రాజకీయాల్లో అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోంది


