
నా కొడుకు పట్టించుకోవడం లేదు..
నాకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. అందరి పెళ్లిల్లు అయ్యాయి. నా భర్త చనిపోయిన తర్వాత నాకున్న మూడెకరాల భూమిని నా కొడుకు జానిమియా పట్టా చేయించుకున్నాడు. నాకు రెండుసార్లు కాళ్లు విరిగాయి. వైద్యం చేయించలేదు. పట్టించుకోవడం లేదు. నల్లగొండలో ఉన్న నా బిడ్డ ఇంటికి వచ్చి రెండు నెలలుగా ఉంటున్నా. ఈ విషయంలో నాకు న్యాయం చేయాలి.
–ఖాసింబీ, నడికుడ, గుర్రంపోడు మండలం
నేను ప్రభుత్వ ఆస్పత్రిలో అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు అనారోగ్యం కారణంగా విధులు నిర్వహించలేకపోతున్నాను. ఆ ఉద్యోగాన్ని నా భార్యకు ఇచ్చి నా కుటుంబం గడిచే విధంగా సహకరించాలి.
– రవి, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి, నల్లగొండ

నా కొడుకు పట్టించుకోవడం లేదు..