
మిగిలింది మూడు రోజులే..
డిపాజిట్ పెంపే కారణమా!
నల్లగొండ: మద్యం టెండర్ల స్వీకరణకు మూడు రోజులే గడువు మిగిలి ఉంది. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానిస్తూ గత నెల 26న ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజర్వేషన్ల వారీగా ఎస్సీ కేటగిరీకి 14, ఎస్టీలకు 4, గౌడ సామాజిక వర్గానికి 34 దుకాణాలు కేటాయించి దరఖాస్తుల స్వీకరిస్తున్నారు.
ఆశించిన స్థాయిలో రాని దరఖాస్తులు
రెండేళ్ల క్రితం 2023లో జిల్లాలో 155 మద్యం దుకాణాలకు టెండర్లు స్వీకరించగా 7,057 మంది దరఖాస్తులు సమర్పించారు. దీంతో జిల్లా ఎకై ్సజ్ శాఖకు భారీ ఎత్తున ఆదాయం సమకూరింది. ఈసారి కూడా పెద్ద ఎత్తున టెండర్ దరఖాస్తులు వస్తాయని భావించిన ప్పటికీ ఆశించిన స్థాయిలో రావడం లేదు. టెండర్ల ప్రక్రియ మొదలై 20 రోజులు గడిచినప్పటికీ మొత్తం 496 దరఖాస్తులే వచ్చాయి. ఇంకా మూడు రోజులు మాత్రమే గడువు ఉండడంతో గతంలో కంటే ఎక్కువగా వస్తాయనే పరిస్థితి కనిపించడం లేదు.
6 వేల పైచిలుకు వచ్చేనా..
ఇప్పటి వరకు కేవలం 496 దరఖాస్తులు మాత్రం వచ్చాయి. అయితే 6 వేల పైచిలుకు దరఖాస్తులు వస్తాయని అధికారులు ఆశిస్తున్నారు. అధికారులు ఆశించిన మేరకు దరఖాస్తులు వస్తేనే గతంలో కంటే ఆదాయం పెరగనుంది. కానీ, దరఖాస్తుల సంఖ్య ఏ మేరకు పెరుగుతుందో గురువారం వచ్చే దరఖాస్తుల బట్టి తెలియనుంది. ఇప్పటి వరకు మంచి రోజులు లేవని కారణాలు చెబుతున్నా మిగిలి మూడు రోజులు మంచిదేనని దరఖాస్తులు పెరగవచ్చని ఎకై ్సజ్ అధికారులు భావిస్తున్నారు.
గతంలో రూ.141 కోట్ల ఆదాయం
గతంలో వచ్చిన దరఖాస్తుల ద్వారా జిల్లా నుంచి ప్రభుత్వానికి రూ.141 కోట్ల ఆదాయం లభించింది. గతంలో వచ్చిన మాదిరిగా ఆదాయం రావాలంటే కనీసం 4,750 దరఖాస్తులు రావాల్సి ఉంది. కానీ, ఈసారి ప్రభుత్వం టెండర్ డిపాజిట్ ధర రూ.3 లక్షలకు పెంచినందున దరఖాస్తులు తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
18వ తేదీ వరకే
మద్యం టెండర్లకు గడువు
ఫ ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు 496
ఫ గతంలో 7,057 టెండర్లు
ఫ ఈసారి భారీగా తగ్గనున్న దరఖాస్తులు
గతంలో టెండరు దరఖాస్తుకు రూ.2లక్షలు డిపాజిట్ ఉండగా దాన్ని ఈ సారి ప్రభుత్వం రూ.3లక్షలకు పెంచింది. దీంతో దరఖాస్తులు వేసే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గతంలో రూ.2 లక్షలు ఉన్న సమయంలో టీమ్‌లుగా ఏర్పడి పదుల సంఖ్యలో మద్యం దుకాణాలకు ఉమ్మడిగా టెండర్లు వేశారు. ఇద్దరు కలిసి చెరో రూ.లక్ష వేసిన వారున్నారు. నలుగురు కలిసి రూ.50 వేలు చొప్పున టెండర్ వేసిన వారు చాలా మంది ఉన్నారు. ఈసారి డిపాజిట్ ధర పెంచడంతో టెండర్లకు ఆసక్తి చూపడం లేదనే చర్చ నడుస్తోంది.