
నూనె గింజల సాగు పెంపే లక్ష్యంగా వంద శాతం సబ్సిడీ
న్యూస్‌రీల్
గురువారం శ్రీ 16 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
వేరుశనగ పంట సాగును పెంచేందుకు నూరుశాతం సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఏటేటా నూనెగింజల ఉత్పత్తులను పెంచాలనే ఉద్దేశంతో కేంద్రం వేరుశనగ సాగును ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు వేరుశనగ సాగుపై దృష్టిపెట్టాలి.
– పాల్వాయి శ్రవణ్‌కుమార్, డీఏఓ
నల్లగొండ అగ్రికల్చర్ : వేరుశనగ సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. జిల్లాలో ఏటేటా నూనెగింజల పంటల సాగు తగ్గుతున్న నేపథ్యంలో ఆయా పంటను సాగు విస్తీర్ణాన్ని పెంచాలని నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రైతులకు ఉచితంగా (నూరుశాతం సబ్సిడీపై) విత్తనాలు అందించనున్నారు. వంట నూనెల ఉత్పత్తులను పెంచడమే లక్ష్యంగా కేంద్ర ఈ పథకాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమైంది.
2 వేలకుపైగా ఎకరాల్లో సాగు..
నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం కింద జిల్లాలో 2,224.44 హెక్టార్ల విస్తీర్ణంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం వేరుశనగ పంటను సాగు చేయించేలా ప్రణాళిక సిద్ధంచేసింది. ఇందుకు గాను యాసంగి సీజన్‌లో వేరుశనగ పంటను సాగుచేయడానికి గాను ఇప్పటికే జిల్లాకు 5,004.99 క్వింటాళ్ల విత్తనాలు కేటాయించగా అవి జిల్లా వ్యవసాయ శాఖకు చేరాయి. వాటిని ఎంపిక చేసిన మండలాలకు చేరవేశారు.
నెల్లికల్లులో వేరుశనగ విత్తనాలు పంపిణీ
తిరుమలగిరి(నాగార్జునసాగర్): నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకంలో భాగంగా బుధవారం తిరుమలగిరి మండలం నెల్లికల్లు గ్రామ రైతు వేదికలో హాలియా ఏడీఏ సరిత ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కదిరి లేపాక్షి రకం వేరుశనగ విత్తనాలు ఎలా విత్తుకోవాలి, సస్యరక్షణ చర్యలు, సాగు మెళకువలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రంలో ఏఓ గంట హర్షిత, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
సాగు విస్తీర్ణం ఆధారంగా కేటాయించిన విత్తనాలు
మండలం హెక్టార్లు విత్తనాలు
(క్వింటాళ్లలో)
దేవరకొండ 500 1,125
చందంపేట 500 1,125
డిండి 474.44 1,067.49
నేరెడుగొమ్ము 500 1,125
పీఏపల్లి 50 112.5
తిరుమలగిరిసాగర్ 80 180
మునుగోడు 40 90
కట్టంగూర్ 80 180
ఫ రైతులను ప్రోత్సహించేందుకు ఉచితంగా విత్తనాలు పంపిణీ
ఫ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం అమలుకు కేంద్రం శ్రీకారం
ఫ జిల్లాలో 2,224.44 హెక్టార్లలో
పంటసాగు చేయించాలని నిర్ణయం

నూనె గింజల సాగు పెంపే లక్ష్యంగా వంద శాతం సబ్సిడీ

నూనె గింజల సాగు పెంపే లక్ష్యంగా వంద శాతం సబ్సిడీ

నూనె గింజల సాగు పెంపే లక్ష్యంగా వంద శాతం సబ్సిడీ

నూనె గింజల సాగు పెంపే లక్ష్యంగా వంద శాతం సబ్సిడీ

నూనె గింజల సాగు పెంపే లక్ష్యంగా వంద శాతం సబ్సిడీ