
ధాన్యం మొత్తం తడిసింది
మూడెకరాల్లో వరి సాగు చేశాం. మిల్లర్ల వద్ద ధర లేకపోవడం, సర్వారంలో కొనుగోలు కేంద్రం లేకపోవడంతో తిప్పర్తి మార్కెట్ యార్డులో ధాన్యం పోశాం. ఇక్కడికి ధాన్యం తెచ్చి వారం రోజులు అవుతోంది. ధాన్యం మంచిగా ఆరిపోయింది. ఇప్పుడు వర్షం వల్ల పూర్తిగా తడిసిపోయింది.
– నాగరాజు, రైతు, సర్వారం, తిప్పరి మండలం
మాడుగులపల్లి కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 15 రోజులు అవుతుంది. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ఆరబోసిన ధాన్యం తడుస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి ఆదుకోవాలి.
– కొండ జానకిరాములు, రైతు, మాడ్గులపల్లి

ధాన్యం మొత్తం తడిసింది