
కుక్కల దత్తతకు అంతా సిద్ధం
నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలో కుక్కల దత్తత, వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అంతా సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు మంత్రి కోమటిరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. శుక్రవారం ఆమె పట్టణంలోని రాంనగర్ పార్కులో ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. అతిథులకు పోలీస్ డాగ్స్ ద్వారా సెల్యూట్, బొకేలు అందజేస్తామని తెలిపారు. దత్తత ఇచ్చే కుక్కల పరిశీలన, బెలూన్లు ఎగరవేయడం ద్వారా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు. అనంతరం పోలీస్ డాగ్ విన్యాసాలను తిలకిస్తారని తెలిపారు. కుక్కలు దత్తతకు కావాల్సిన వారు రాంనగర్ పార్క్‌కు శనివారం ఉదయం 7.30 గంటలకు చేరుకోవాలని సూచించారు. ఆమె వెంట స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ రమేష్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ఉన్నారు.