నల్లగొండ : రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ నెల 15న నల్లగొండకు వస్తున్నందున కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్‌లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నందున ఆ రోజు ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారులు ఈ విషయం గమనించి ఈ నెల 22న సోమవారం ప్రజావాణికి హాజరుకావాలని పేర్కొన్నారు.
ఫర్టిలైజర్ షాపులపై టాస్క్‌ఫోర్స్ దాడులు
నల్లగొండ : నల్లగొండలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను టాస్క్‌ఫోర్స్ సిబ్బంది శుక్రవారం తనిఖీ చేశారు. యూరియా స్టాక్ వివరాలను తెలుసుకున్నారు. ఆ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ స్టాక్ వివరాలను దుకాణం ఎదుట ప్రదర్శించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కాకుండా అధిక ధరలకు విక్రయించినా, పక్కదారి పట్టించినా, అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని.. పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.
పీఆర్‌టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా భిక్షంగౌడ్
నల్లగొండ : పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సుంకరి భిక్షంగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. భిక్షంగౌడ్‌కు ఎన్నికపై పీఆర్‌టీయూ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఎస్‌కె.వలీ భాషా, ఇతర నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
స్కూల్ బస్సులు ిఫిట్‌నెస్ కలిగి ఉండాలి
నల్లగొండ : ప్రైవేట్ పాఠశాలలకు చెందిన స్కూల్ బస్సులు ఫిట్‌నెస్ కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలల యాజమాన్యాలు అర్హులైన డ్రైవర్లను నియమించాలని సూచించారు. విద్యార్థులను బస్‌లలో తీసుకెళ్లడం తిరిగి తీసుకురావడం వరకు పూర్తి జాగ్రత్తలు పాటించాలన్నారు. టాస్క్‌ఫోర్సు కమిటీలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలని డీఈఓను ఆదేశించారు. సమావేశంలో డీఈఓ భిక్షపతి, ఆర్‌టీఓలు, ఎంవీఐలు పాల్గొన్నారు.
ప్రజావాణి రద్దు
ప్రజావాణి రద్దు