పత్రికా స్వేచ్ఛను హరించొద్దు | - | Sakshi
Sakshi News home page

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు

Sep 13 2025 7:21 AM | Updated on Sep 13 2025 7:37 AM

మీడియాపై కేసులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ప్రభుత్వం మీడియాపై కక్ష సాధిపు తగదు ఏపీ ప్రభుత్వ తీరును ఖండిస్తున్నాం కేసులు నమోదు సరికాదు

అన్నదాత ఆగ్రహం
ఏపీలో సాక్షి ఎడిటర్‌, జర్నలిస్టులపై కేసులు సరికాదన్న ప్రజా సంఘాల నేతలు

వాతావరణంలోని మార్పు వల్లే చీడలు

మునుగోడు : వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా పంటలపై చీడ పురుగుల ఉధృతి పెరిగిందని కృషివిజ్జాన కేంద్రం కంపాసాగర్‌ శాస్త్రవేతలు డాక్టర్‌ రాములమ్మ, డాక్టర్‌ లింగయ్య తెలిపారు. మునుగోడు డివిజన్‌లోని పత్తి చేలు ఎర్రబారడంతో ఈ నెల 10న ‘సాక్షి’లో ఎర్రబారుతున్న పత్తిచేలు శీర్షికన ప్రచురితమైన కథనానికి వ్యవసాయ అధికారులు స్పందించారు. శుక్రవారం మునుగోడు మండలంలోని గంగోరిగూడెం, పులిపలుపుల, ఎల్గలగూడెం తదితర గ్రామాల్లోని పత్తి పంటను పరిశీలించారు. పత్తి చేలల్లో రసం పీల్చే, తామర, ఎర్రనల్లి పురుగుల ఉధృతి అధికంగా ఉందని గుర్తించారు. తెగుల నివారణకు రైతులు తమ పత్తి చేలకు ఎకరానికి ఫ్రిఫొనిల్‌, అసిటామిక్లోప్రిడ్‌ 400 ఎం.ఎల్‌ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలని, లేదా డిఫెంతియురాన్‌ 400 ఎం.ఎల్‌ లేదా క్లోర్‌ఫెనాపైర్‌ 400 ఎం.ఎల్‌, అజాక్సీస్ట్రోబిన్‌ 200 ఎం.ఎల్‌, వేపనూనె 1500 పీపీఎం 1 లీటరు చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు. వారి వెంట మునుగోడు ఏడీఏ వేణుగోపాల్‌, ఏఓ పద్మజ, ఏఈఓలు, రైతులు ఉన్నారు.

తిప్పర్తి : సకాలంలో యూరియా అందించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. వరి నాట్లు వేసుకొని రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు యూరియా వేయకపోవడంతో పంట ఎదుగుదల లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటి, రెండు బస్తాలు ఇస్తే.. పొలాలకు ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. ఉదయం నుంచి కుటుంబం మొత్తం వచ్చి లైన్‌లో నిలబడినా యూరియా మాత్రం దొరకడం లేదని వాపోయారు. రైతుల రాస్తారోకో వద్దకు వ్యవసాయాధికారులు, పోలీసులు చేరుకుని శనివారం యూరియా వస్తుందని చెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు.

ప్రజలు, ఉద్యోగుల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు పత్రికలకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం మీడియాపై పెడుతున్న అక్రమ కేసులు, అణిచివేత ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఏ ప్రభుత్వాలైనా మీడియాను అణిచివేస్తే ప్రజా వ్యతిరేకత వస్తుంది. ఉద్యోగులు, ప్రజలు మీడియాకు ఎలప్పుడూ బాసటగా నిలుస్తారు.

– జేజేల శేఖర్‌రెడ్డి, టీఎన్‌జీవో జిల్లా కార్యదర్శి

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ఉద్దేశపూర్వకంగా మీడియాపై కేసులు పెట్టడం సరికాదు. మీడియాలో కేవలం పాలకపక్షం వార్తలే కాదు. ప్రతిపక్ష వార్తలు కూడా వస్తాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిపై కేసు పెట్టవచ్చు కాదు. అది ప్రచురించిన సంపాదకుడిపై కేసు పెట్టడం అధికార దుర్వినియోగమే అవుతుంది. పత్రికా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. సంపాదకుడిపై కేసులు పెట్టే సంస్కృతికి కూటమి ప్రభ్వుత్వం స్వస్తి పలకాలి.

– నాగిల్ల మురళి, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌

పత్రికలపై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్షసాధింపు ధోరణిపై ప్రజాసంఘాల నాయకులకు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి వినిపించడమే ప్రతిపక్ష పార్టీల కర్తవ్యమని, పత్రికలు, మీడియా బాధ్యత కూడా ఇదేనని పేర్కొంటున్నారు. కానీ ప్రజా సమస్యలను వినిపించుకోకుండా ఏకపక్షంగా గొంతు నొక్కే ప్రయత్నం ప్రజా క్షేత్రంలో చెల్లుబాటు కాదని హెచ్చరించారు. సాక్షి మీడియాపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న కక్షసాధింపు చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు.

మీడియాపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదు. పత్రికలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యం కల్పించింది. పత్రిక సంపాదకుడిపై ఏకంగా కేసు నమోదు చేయడం సరైన పద్ధతి కాదు. సాక్షి ఎడిటర్‌ ధనుంజయరెడ్డిపై, జర్నలిస్టులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి. పత్రికలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడిన ప్రభుత్వాలు మనుగడ సాగించలేవు. – చొల్లేటి ప్రభాకర్‌, రిటైర్డు ఐఏఏస్‌ అధికారి

పత్రికా స్వేచ్ఛ మన ప్రజాస్వామానికి నాలుగో మూల స్తంభం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సాక్షి సంపాదకుడిపై కేసు పెట్టడమంటే కక్ష సాదింపు చర్యలో భాగమే. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. సాక్షి ఎడిటర్‌, జర్నలిస్టులపై కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.

– వంగూరి విజయ్‌కృష్ణ, తెలంగాణ సహకార శాఖ టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు

ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించడం సరైన పద్ధతి కాదు. పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రెస్‌మీట్‌ను వక్రీకరించకుండా యథాతథంగా ప్రచురించడం సంపాదకుడి బాధ్యత. సాక్షి ఎడిటర్‌గా తన విధిని నిర్వహించిన ఆర్‌.దనుంజయరెడ్డిపై కేసులు నమోదు చేయడం సరికాదు.

– పానెం వెంకటరావు, తెలంగాణ మెడికల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకుడు

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు1
1/8

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు2
2/8

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు3
3/8

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు4
4/8

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు5
5/8

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు6
6/8

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు7
7/8

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు8
8/8

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement