
పురుగులు, తుట్టెలు!
దొడ్డు బియ్యం తీసుకుపోవాలి
నల్లగొండ : రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ముక్కిపోతున్నాయి. ఈ ఏడాది మార్చి వరకు లబ్ధిదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేయగా.. ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. అంతకుముందు రేషన్ దుకాణాలకు సరఫరా చేసిన దొడ్డుబియ్యం ఐదు నెలలుగా వృథాగా ఉంటున్నాయి. దీంతో చాలా చోట్ల ఈ బియ్యం పురుగులు పట్టి, తుట్టెలు కడుతున్నాయి. ప్రభుత్వం దొడ్డు బియ్యం ఆయా చోట్లనుంచి ఖాళీ చేయకుండానే సన్న బియ్యం స్టాక్ పెట్టింది. దీంతో అప్పటికే నిల్వ ఉన్న దొడ్డుబియ్యం నుంచి పురుగులు సన్న బియ్యానికి పడుతున్నాయి.
పేరుకుపోయిన దొడ్డుబియ్యం నిల్వలు
జిల్లాలోని రేషన్‌దుకాణాలు, ఎంఎల్‌ఎస్ పాయింట్లు, గోదాముల్లో ఆరువేల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. సన్న బియ్యాన్ని పంపిణీ చేసే క్రమంలో రేషన్ షాపుల నుంచి మిగిలిఉన్న దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం సేకరించలేదు. దీంతో డీలర్లు రేషన్ షాపులోనే ఒక మూలన పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ బియ్యం పురుగులు, తుట్టెలు పట్టి పనికి రాకుండా పోతుంది. ఒక పక్క రేషన్‌షాపులు చిన్నగా ఉండటంతో దొడ్డు బియ్యం నిల్వలతో సగం షాపులు నిండిపోవడంతో సన్నబియ్యం కోటా రావడంతో షాపుల్లో స్థలం సరిపోక చాలా ప్రాంతాల్లో రేషన్‌డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు దొడ్డు బియ్యం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
జిల్లాలో 997 రేషన్ షాపులు
జిల్లాలో 997 రేషన్ షాపులు ఉన్నాయి. ఏప్రిల్ నెలలలో సన్న బియ్యం పంపిణీకి ముందు ఆయా రేషన్‌షాపుల్లో మొత్తం 1500 మెట్రిక్ టన్నుల పైచి లుకు దొడ్డు బియ్యం ఉన్నట్లు అంచనా. అయితే బియ్యం కేటాయింపు నిల్వలంతా రాష్ట్రస్థాయి నుంచే ఆన్‌లైన్ విధానంలో కొనసాగుతుంది. సన్న బియ్యం పంపిణీ సందర్భంలో దొడ్డు బియ్యం నిల్వకు సంబంధించిన ఆన్‌లైన్ నిలిపివేసి.. సన్న బియ్యానికి సంబంధించిన ఆన్‌లైన్ విధానం అమలు చేశారు. దీంతో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారుల వద్ద ఏ రేషన్ షాపుల్లో ఎంత దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయో తేలియడం లేదు.
దొడ్డు బియ్యంపై పట్టింపేది..
జిల్లాలో గోదాములు, ఎంఎల్‌ఎస్ పాయింట్లతో పాటు రేషన్ షాపుల్లో 6 వేల మెట్రిక్ టన్నుల వరకు దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. ఈ బియ్యంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వాటిని ఏమి చేయాలో తెలియక రేషన్ డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం రేషన్ షాపుల నుంచి వెనక్కు తీసుకుని వాటిని వేలం ద్వారా అమ్మడమా.. లేక ఇతర ప్రాంతాలకు తరలించడమా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
రేషన్‌షాపుల్లో
ముక్కిపోతున్న దొడ్డుబియ్యం
ఫ ఐదు నెలలుగా ఏ నిర్ణయం
తీసుకోని అధికారులు
ఫ సన్న బియ్యానికి చేరుతున్న పురుగులు
ఫ ఇబ్బంది పడుతున్న రేషన్ డీలర్లు
బఫర్ గోదాముల్లో 4,322.057 మెట్రిక్ టన్నులు
ఏప్రిల్ నుంచి ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. మా వద్ద ఉన్న దొడ్డు బియ్యాన్ని ఇప్పటి వరకు తీసుకోలేదు. రేషన్‌షాపులో స్థలం లేక ఇబ్బంది కలుగుతోంది. దానికి తోడు దొడ్డు బియ్యానికి పురుగు వస్తుంది. అది సన్న బియ్యానికి కూడా అంటుకునే ప్రమాదం ఉంది. వెంటనే దొడ్డు బియ్యం నిల్వలను తరలించాలి.
– అశోక్‌రెడ్డి, డీలర్, నల్లగొండ

పురుగులు, తుట్టెలు!

పురుగులు, తుట్టెలు!