
12,740 దరఖాస్తులు
ఎన్‌ఎఫ్‌బీఎస్‌కు వచ్చిన దరఖాస్తులు
దరఖాస్తుల స్వీకరణపై దృష్టి పెట్టాలి
ఇది నిరంతర ప్రక్రియ
పది రోజుల్లో
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జాతీయ కుటుంబ సంక్షేమ పథకం (ఎన్‌ఎఫ్‌బీఎస్) కింద ఆర్థిక సహాయం కోసం పది రోజుల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. పేద కుటుంబాలకు చెందిన ఇంటి పెద్ద ప్రమాదవశాత్తు, సహజంగా మరణించినా ఆ ఇంటికి రూ.20 వేల తక్షణ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ పెద్ద ఎత్తున అవగాహన కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో ప్రజల నుంచి అదేస్థాయిలో స్పందన వస్తోంది. జిల్లా యంత్రాంగం మొత్తాన్ని, ముఖ్యంగా మండల స్థాయి అధికారులను భాగస్వాములను చేయడంతో పాటు కలెక్టర్ స్వయంగా మండలాలతోపాటు డివిజన్ కేంద్రాల్లో ఈ పథకం అమలుపై సమీక్షలు నిర్వహించారు. దీంతో పది రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా 12,740 దరఖాస్తులు వచ్చాయి.
నల్లగొండ డివిజన్‌లో అధికంగా దరఖాస్తులు
గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన నిరుపేదలు ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు ఆన్‌లైన్‌తోపాటు ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీంతో ఒక్క నందికొండ మున్సిపాలిటీ మినహా ప్రతి మండలంలో 150కి పైగానే దరఖాస్తులు వచ్చాయి. డివిజన్ల వారీగా చూస్తే నల్లగొండ డివిజన్‌లోనే అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. నల్లగొండ డివిజన్ పరిఽధిలో ఈనెల 1వ తేదీ వరకే 4,306 దరఖాస్తులు రాగా, మిర్యాలగూడ డివిజన్‌లో 4,066 కుటుంబాలకు చెందిన పేదలు దరఖాస్తు చేసుకున్నారు. దేవరకొండ డివిజన్‌లో 2,737 మంది దరఖాస్తు చేసుకోగా, చండూరు డివిజన్‌లో 1,631 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 12,740 దరఖాస్తులు రాగా, కొన్ని మండలాల్లో ఆరేడు వందల దరఖాస్తులు రావడం గమనార్హం.
ఇన్నాళ్లూ
అవగాహన కరువు
ఎన్‌ఎఫ్‌బీఎస్ పథకంపై ప్రజల్లో అవగాహన లేకపోవడంతో ఇన్నాళ్లూ ప్రజలు దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో కలెక్టర్ ప్రత్యేక కార్యక్రమంగా తీసుకొని ఈ పథకం అమలుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో 2017 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు 42 వేల మంది మరణించినట్లు జిల్లా యంత్రాంగం తమ వద్ద ఉన్న లెక్కల ప్రకారం తేల్చింది. అర్హులైన వారు తమ కుటుంబ పెద్ద చనిపోయినట్లు ఆధారాలతో దరఖాస్తు చేసుకునేలా కలెక్టర్ చర్యలు చేపట్టారు.
వెంటవెంటనే ప్రాసెసింగ్..
ఈ పథకం కోసం వస్తున్న దరఖాస్తులను వెంటవెంటనే ప్రాసెస్ చేసేలా చర్యలు చేపట్టాలని ఎంపీడీఓ, తహసీల్దార్‌ను, ఉన్నతాధికారులను కలెక్టర్ ఆదేశించారు. మండల కార్యాలయాల్లో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ప్రాసెస్ ఆర్‌డీఓకు పంపించాలని, అక్కడి నుంచి డీఆర్‌ఓ, తనకు పంపిస్తే నిబంధనల ప్రకారం ఉన్న వాటికి అప్రూవల్ ఇస్తామని స్పష్టం చేశారు.
ఆరు వేల కుటుంబాలకు మంజూరు
జిల్లాలో పేదల నుంచి వచ్చిన దరఖాస్తులను ప్రాసెస్ చేసి కలెక్టర్‌కు వచ్చిన దాదాపు ఆరు వేల అర్హులైన కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు కలెక్టర్ ఓకే చెప్పారు. అందులో ఇప్పటికే 2,723 మందికి ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. మిగతా వారికి ఆర్థిక సహాయం అందించేందుకు కలెక్టర్ ప్రభుత్వానికి ఫైల్ పంపించారు. మరో సగానికిపైగా దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది.
మున్సిపాలిటీ దరఖాస్తులు
చండూరు 131
దేవరకొండ 210
హాలియా 183
మిర్యాలగూడ 796
నందికొండ 60
చిట్యాల 153
నకిరేకల్ 309
నల్లగొండ 959
మండలం దరఖాస్తులు
చండూరు 301
గట్టుప్పల్ 163
మర్రిగూడ 311
మునుగోడు 430
నాంపల్లి 295
చందంపేట 330
చింతపల్లి 379
దేవరకొండ 276
గుడిపల్లి 119
డిండి 559
గుర్రంపోడు 183
కొండమల్లేపల్లి 202
నేరెడుగొమ్ము 194
పీఏపల్లి 285
అడవిదేవులపల్లి 180
అనుముల 208
దామరచర్ల 248
మాడుగులపల్లి 332
మిర్యాలగూడ 446
నిడమనూరు 280
పెద్దవూర 348
తిరుమలగిరిసాగర్ 315
త్రిపురారం 305
వేములపల్లి 345
చిట్యాల 184
కనగల్ 333
కట్టంగూర్ 500
కేతేపల్లి 374
నకిరేకల్ 304
నల్లగొండ 187
నార్కట్‌పల్లి 362
శాలిగౌరారం 364
తిప్పర్తి 277
మొత్తం 12,740
కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ : జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఎక్కువ దరఖాస్తులు స్వీకరించేలా అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం ఆమె వివిధ అంశాలపై టెల3ఈ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. జాతీయ కుటుంబం ప్రయోజన పథకం కింద పేదరకు లబ్ధి చేకూర్చేందుకు కృషి చేసిన ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఈ నెల 13న సన్మానిస్తామన్నారు. మున్సిపాలిటీల్లో దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉందని వాటిని పెంచేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, ఆర్డీఓలు అశోక్‌రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎన్‌ఎఫ్‌బీఎస్‌కు అనూహ్య స్పందన
ఫ కలెక్టర్ చొరవతో పెద్ద ఎత్తున
మందుకొస్తున్న బాధిత కుటుంబాలు
ఫ పథకం నిరంతరం అమల్లో
ఉంటుందని ప్రకటన
ఫ 6 వేల కుటుంబాలకు ఆర్థిక సాయం మంజూరు
జాతీయ కుటుంబ సంక్షేమ పథకం నిరంతం కొనసాగుతుంది. పేద కుటుంబాలకు చెందిన ఇంటి పెద్ద మరణిస్తే ఆయా కుటుంబాలు తక్షణ సాయం కోసం ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటివరకు ఆరు వేల కుటుంబాలకు పథకాన్ని మంజూరు చేశాం. వచ్చే వారం రోజుల్లో దాదాపు 10 వేల కుటుంబాలకు మంజూరు చేసే అవకాశం ఉంది. ఈ పథకం అమలులో భాగంగా ఆర్థిక సాయం పొందిన లబ్ధిదారులతో ఈనెల 13వ తేదీన సెర్ప్ సీఈఓ సమావేశం కానున్నారు.
– కలెక్టర్ ఇలా త్రిపాఠి