స్థానిక సంస్థల ముసాయిదా జాబితాల ప్రకటన | - | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ముసాయిదా జాబితాల ప్రకటన

Sep 7 2025 7:14 AM | Updated on Sep 7 2025 7:14 AM

స్థానిక సంస్థల ముసాయిదా జాబితాల ప్రకటన

స్థానిక సంస్థల ముసాయిదా జాబితాల ప్రకటన

నల్లగొండ : త్వరలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల, పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి శనివారం ప్రకటించారు. జిల్లాలోని అన్ని మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ కార్యాలయాల నోటీస్‌ బోర్డులపై జాబితాలను ఉంచారు. మొత్తం 33 జెడ్పీటీసీలు, 353 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వాటి పరిధిలో గతంలో 1,925 పోలింగ్‌ స్టేషన్లు ఉండేవి.. ప్రస్తుతం ముసాయిదా జాబితాలో వాటిని 1,956కు పెంచారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓటర్ల జాబితానే తీసుకుని స్థానిక సంస్థల ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించారు. దీని ప్రకారం జిల్లాలో మొత్తం ఓటర్లు 10,73,506 మంది ఉండగా అందులో పురుషులు 5,30,860 మంది, మహిళలు 5,42,589 మంది, ఇతరులు 57 మంది ఉన్నట్లు ముసాయిదాను ప్రకటించారు.

9న అప్రెంటిస్‌షిప్‌ మేళా

నల్లగొండ : నల్లగొండలోని ప్రభుత్వ ఐటీఐలో ఐటీఐ అభ్యర్థులకు ఈ నెల 9న అప్రెంటిస్‌షిప్‌ మేళా నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ శ్రీరాములు శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ మేళాకు ఎలక్ట్రిషియన్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, డ్రాప్టుమెన్‌ సివిల్‌, మెషినిస్టు, స్టెనోగ్రఫీ, డ్రస్‌కీ మేకింగ్‌ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు అర్హులని ఆయన తెలిపారు. ఆసక్తి, అర్హత గల వారు పూర్తి బయోడేటా, ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, 2 పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలతో నేరుగా ఐటీఐ కాలేజీ వద్దకు హాజరు కావాలని సూచించారు.

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

పెద్దవూర : పదో తరగతి ఫలితాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులను శనివారం మున్ననూర్‌ ఐటీడీఏ పరిధిలోని అచ్చంపేటలో సన్మానించారు. పదవ తరగతి విద్యార్థులకు బోధించిన అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులను గిరిజన సంక్షేమ శాఖ డీడీ చందనా సర్పే, నాగర్‌కర్నూల్‌ జిల్లా డీటీడీఓ ఫిరంగి శాలువాలు, పూలమాలలతో సత్కరించి మెమోంటో, జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఏసీఎంఓ డీ.వీ.నాయక్‌ పాల్గొన్నారు. సన్మానం పొందిన వారిలో పెద్దవూర పాఠశాల హెచ్‌ఎం డి.బాలోజీ, ఉపాధ్యాయులు కూన్‌రెడ్డి రాంరెడ్డి, బి.కృష్ణ, ఎండీ.షబ్బీర్‌, సంధ్యా, శ్రీనునాయక్‌, షాహీన్‌బేగం ఉన్నారు.

రాష్ట్రస్థాయి క్రీడలకు

85 మంది ఎంపిక

నల్లగొండ టూటౌన్‌ : నల్లగొండలోని ఇండోర్‌, అవుట్‌డోర్‌ స్టేడియాల్లో శనివారం నిర్వహించిన ఆలిండియా సివిల్‌ సర్వీస్‌ టోర్నమెంట్‌ (19 విభాగాల్లో) 135 మంది వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పాల్గొనగా 85 మంది రాష్ట్రస్థాయి పోటీకి ఎంపికై నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి ఎండీ.అక్బర్‌అలీ తెలిపారు. ఎంపికై న వారు ఈ నెల 9 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో నిర్వహించే పోటీల్లో పాల్గొననున్నారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement