
కోమటిరెడ్డిని విమర్శిస్తే సహించం
ఫ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు
గుమ్మల మోహన్‌రెడ్డి
నల్లగొండ : నల్లగొండ కోమటిరెడ్డి అడ్డా అని.. ఇక్కడి నుంచి ఐదు గెలిచారని.. అలాంటి నాయకుడిని బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు విమర్శిస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రిని వ్యక్తిగతంగా విమర్శిస్తే సహించేది లేదన్నారు. వినాయక శోభాయాత్ర సందర్భంగా 1వ వినాయక విగ్రహం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడితోపాటు మాజీ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. మంత్రి మాట్లాడుతుండగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిని పిలువడంలేదనే అక్కసుతో అక్కడ ఘర్షణ వాతావరనం సృష్టించారని విమర్శించారు. రాజకీయ కనీస అవగాహన లేని బీజేపీ అధ్యక్షుడు ఇలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి అభివృద్ధే ద్యేయంగా, పేదల సంక్షేమం కోసం 25 ఏళ్లుగా పని చేస్తున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ కార్యకర్తల చేత దాడులు చేయించుకుని.. గన్‌మెన్లను ఏర్పాటు చేయించుకోవాలని ప్రయత్ని స్తున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో నాయకులు కత్తుల కోటి, కూసుకుంట్ల రాజిరెడ్డి, దుబ్బ రూప, బొజ్జ శంకర్, సురిగి వెంకన్నగౌడ్, మామిడి కార్తిక్, గాలి నాగరాజు, కంచర్ల ఆనంద్‌రెడ్డి, ఇటికాల శ్రీనివాస్, పిల్లి యాదగిరియాదవ్, పాండు, సుజాత, స్వరూపారెడ్డి, రమేష్‌యాదవ్ పాల్గొన్నారు.