
హైదరాబాద్ వెళ్లిన గ్రామ పాలనాధికారులు
నల్లగొండ : గ్రామ పాలనాధికారులుగా ఎంపికైన వారు శుక్రవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాలు అందుకునేందుకు నల్లగొండ నుంచి మూడు బస్సుల్లో తరలివెళ్లారు. ఈ బస్సులను ఎన్జీ కళాశాల మైదానం వద్ద కలెక్టర్ ఇలా త్రిపాఠి జెండా ఊపి పంపించారు. కార్యక్రమంలో నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, నల్లగొండ తహసీల్దార్ పరుశురాములు తదితరులు పాల్గొన్నారు.
‘నవాబుపేట’తో గుండాల సస్యశ్యామలం
గుండాల: నవాబుపేట రిజర్వాయర్ నీటితో గుండాల మండలాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. శుక్రవారం నవాబుపేట రిజర్వాయర్ ద్వారా గుండాల మండలానికి సాగునీటిని విడుదల చేశారు. గంగమ్మకు పసుపు, కుంకుమలు పూలు సమర్పించి కొబ్బరి కాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని చెరువులను నింపి ప్రతి ఎకరాకు నీరందిస్తామన్నారు. కాల్వలకు మరమ్మతులు చేపడతామన్నారు. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను సాగునీటి ప్రాజెక్టుల పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. అప్పుల పాలు చేసి రైతులపై భారం మోపిందన్నారు. ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, నూనెముంతల విమలవెంకటేశ్వర్లు, యాదగిరిగౌడ్, ద్యాప కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

హైదరాబాద్ వెళ్లిన గ్రామ పాలనాధికారులు