
రవాణా శాఖ వెబ్‌సైట్‌పై అవగాహన కల్పించాలి
కోదాడరూరల్ : రవాణాశాఖ నూతనంగా తీసుకువచ్చిన వెబ్‌సైట్ www.ttransport.gov.in పై వాహనదారులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఉమ్మడి జిల్లా రవాణా శాఖ అధికారి డీటీఓ వాణి సూచించారు. ఆదివారం రాత్రి కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల శివారులో ఉన్న అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్‌పోస్టును ఆమె తనిఖీ చేశారు. టెంపరరీ పర్మిట్, వలంటరీ ట్యాక్స్, స్పెషల్ పర్మిట్‌పై వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ విధానంతో సిబ్బందికి పనిభారం తగ్గడంతో పాటు వాహనదారులకు సమయం ఆదా అవుతుందన్నారు. ఆమె వెంట నల్లగొండ డీటీఓలు కొండయ్య, సూర్యాపేట డీటీఓ జయప్రకాష్‌రెడ్డి, ఎంవీఐలు రాజ్‌మహ్మద్, శ్రీనివాస్, ఏఎంవీఐలు సాయిప్రసాద్, లావణ్య, సిబ్బంది ఉన్నారు.
రవాణా శాఖ అధికారి వాణి