
నాణ్యమైన భోజనం అందించాలి
కట్టంగూర్ : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సమగ్ర శిక్షా అభియాన్ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఏఎస్‌పీడీ) ఎం.రాధారెడ్డి అన్నారు. బుధవారం కట్టంగూర్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆమె జీసీడీఓ కె.అరుంధతి, డీఈఓ బొల్లారం భిక్షపతితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటర్ కళాశాల భవనాన్ని, వంటగది, స్టోర్‌రూం, మధ్యాహ్న భోజనాన్ని ఆమె పరిశీలించి మాట్లాడారు. భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులతో సమావేశమై పాఠశాలలో నిర్వహిస్తున్న గుణాత్మక విద్యా కార్యక్రమాల అమలుతీరును తెలుసుకున్నారు. రాత్రి విద్యార్థులతో కలిసి బస చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ అంబటి అంజయ్య, ఎస్‌ఓ నీలాంబరి ఉపాధ్యాయులు ఉన్నారు.