
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్
నల్లగొండ: గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ టూటౌన్ సీఐ రాఘవరావు తెలిపారు. ఈ కేసు వివరాలను సీఐ సోమవారం విలేకరులకు వెల్లడించారు. నల్లగొండ పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పెరిక కరణ్ జయరాజ్, శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి చెందిన ప్రైవేట్ టీచర్ శివశంకర్, వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన మార్బుల్ వర్కర్ పెద్దమాము వీరస్వామి స్నేహితులు. వీరు ముగ్గురు గంజాయికి బానిసై హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో గంజాయి కొనుగోలు చేసి తాగేవారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్ధేశంతో పెరిక కరణ్ జయరాజ్ డబ్బులు పెట్టుబడి పెట్టి శివశంకర్‌ను హైదరాబాద్‌కు పంపగా అతడు ధూల్‌పేటలో కిలో గంజాయి రూ.10వేలకు కొనుగోలు చేసి నల్లగొండకు తీసుకొచ్చేవాడు. వీరు ముగ్గురు కలిసి గంజాయిని చిన్న ప్యాకెట్లుగా మార్చి నల్లగొండలో గంజాయి తాగే వ్యక్తులకు ఒక్కో ప్యాకెట్ రూ.500కు అమ్మేవారు. సోమవారం వీరు ముగ్గురు కలిసి నల్లగొండలో గంజాయిని చిన్న ప్యాకెట్లుగా మారుస్తుండగా.. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ముగ్గురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.40వేలు విలువ చేసే కిలోన్నర గంజాయి, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. సీఐ రాఘవరావు ఆధ్వర్యంలో నిందితులను పట్టుకున్న ఎస్‌ఐ సైదులు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అభినందించారు.
రూ.40వేల విలువైన గంజాయి,
3 సెల్‌ఫోన్లు స్వాధీనం