
విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి
నల్లగొండ టూటౌన్: విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటే ఉపాధి అవకాశాలు లభిస్తాయని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. సోమవారం ఎంజీయూ సెమినార్ హాల్‌లో యూనివర్సిటీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కాంపిటస్ ఫార్మా ట్రైనింగ్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీసీ పాల్గొని మాట్లాడారు. నేటి తరం విద్యార్థులకు నైపుణ్యాలే ప్రామాణికమని, నిత్య విద్యార్థులుగా నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటూ అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. కాంపిటస్ ఫార్మా ట్రైనింగ్ సెంటర్ ప్రతినిధి దీపక్‌వర్మ మాట్లాడుతూ.. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. నైపుణ్యాలు, ఇంటర్వ్యూ విధానం గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రేమ్‌సాగర్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ తిరుమల, కోఆర్డినేటర్ డాక్టర్ అభిలాష తదితరులు పాల్గొన్నారు.
అవగాహన కార్యక్రమానికి హాజరైన వీసీ
అల్తాఫ్ హుస్సేన్‌కు మొక్క అందజేస్తున్న విద్యార్థి
ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్