
సోలార్ ప్లాంట్‌ల ఏర్పాటుతో లాభాలు
నల్లగొండ అగ్రికల్చర్ : వ్యవసాయ భూముల్లో సోలార్ ప్లాంట్‌లను ఏర్పాటుతో రైతులు లాభాలు పొందవచ్చని తెలంగాణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ ఎం.పాండురంగారావు అన్నారు. గురువారం నల్లగొండలో నాచురల్ పవర్ ఏసియా ప్రైవేట్ లిమిటెంట్ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు సోలార్ ప్లాంట్‌ల ఏర్పాటుపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సోలార్ ప్లాంట్‌ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను విద్యుత్ సంస్థలకు అమ్ముకోవచ్చన్నారు. నాచురల్ పవర్ ఏసియా సంస్థ ఎండీ కె.శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్లాంట్‌ల ఏర్పాటు, పెట్టుబడి రైతులకు వచ్చే ఆదాయంపై వివరంగా తెలియజేశారు. ఈ సదస్సులో విద్యుత్ సంస్థ డీఈ కృష్ణారావు, ఏఇ నవీద్ ఆహ్మద్, ఎస్‌బీహెచ్ అధికారి హరికృష్ణ రైతులు పాల్గొన్నారు.
బీసీ అభివృద్ధి ఇన్‌చార్జి అధికారిగా రాజ్‌కుమార్
నల్లగొండ : జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి ఇన్‌చార్జిగా అధికారిగా గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఇక్కడ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న అలీమొద్దీన్‌ను నాగర్‌కర్నూల్ అధికారిగా పనిచేస్తున్నారు. అయితే ఆయన రెండు జిల్లాలో పనిచేయడం ఇబ్బందిగా ఉండడంతో జిల్లా కలెక్టర్ రాజ్‌కుమార్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
మహిళల ఆర్థికబలోపేతానికి కృషి
మిర్యాలగూడ : మహిళలను ఆర్థికంగా బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం రుణాలు అందిస్తూ ఎంతగానో కృషిచేస్తోందని డీఆర్‌డీఓ వై.శేఖర్‌రెడ్డి అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా గురువారం దామరచర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళాజాతాలో ఆయన మాట్లాడారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం, డ్వాక్రా బజార్లు మొదలైన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఏపీఎం గుంటి దిలీప్‌కుమార్, సీపీలు శంకర్, శ్రీనివాస్, మాధవి, అనూష, కవిత, వీఓఏలు సంజీవరెడ్డి, నాగలక్ష్మీ, సీతామహాలక్ష్మి, నాగమణి, శ్రీదేవి, శాంతమ్మ, నాగలక్ష్మీ, కళాజాత సభ్యులు బచ్చలకూరి శ్రీను, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు ఎరువులు
అందుబాటులో ఉంచాలి
త్రిపురారం : రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలని, అధిక దరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేసి లైసెన్సులు రద్దు చేస్తామని జేడీఏ శ్రవణ్ కుమార్ అన్నారు. గురువారం త్రిపురారం మండల కేంద్రంలో ఫర్టిలైజర్ దుకాణాను తనిఖీ చేసి మాట్లాడారు. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలన్నారు. శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు పాటించాలన్నారు. ఆయన వెంట త్రిపురారం ఏఓ పార్వతి చౌహాన్, సిబ్బంది, డీలర్లు ఉన్నారు.
నవోదయలో ప్రవేశానికి దరఖాస్తులు
నల్లగొండ : జవహర్ నవోదయ విదాయలయాల్లో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యా శాఖ అధికారి భిక్షపతి గురువారం ఒక ప్రకటనలలో తెలిపారు. ప్రవేశ పరీక్ష డిసెంబర్ 13న జరుగుతుందని, ఈనెల 29లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అన్ని పాఠశాలలు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు తమ పాఠశాలల పిల్లలు దరఖాస్తు చేసుకునేలా సహకరించాలని కోరారు.
ఆగస్టు 3 నుంచి టీటీసీ పరీక్షలు
టెక్నికల్ టీచర్ కోర్సు (టీటీసీ) వేసవి శిక్షణ శిబిరాలు పూర్తిచేసిన వారికి ఆగస్టు 3వ తేదీ నుంచి లోయర్ గ్రేడ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

సోలార్ ప్లాంట్‌ల ఏర్పాటుతో లాభాలు

సోలార్ ప్లాంట్‌ల ఏర్పాటుతో లాభాలు