
పెద్దఅడిశర్లపల్లి నుంచి కుబేర వరకు..
ఫ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సత్తాచాటుతున్న మేడారం కుర్రాడు
ఫ కుబేర సినిమాకు చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన అరవింద్
●
అరవింద్ తల్లిదండ్రులు అతడి చిన్నతనంలో బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లగా.. వారితో పాటు అతడు కూడా వెళ్తూ సంక్షేమ హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నారు. ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు పేపర్‌బాయ్‌గా, క్యాటరింగ్ బాయ్‌గా, రైస్‌మిల్లు నైట్ షిఫ్ట్ చేస్తూ సొంత ఖర్చులు సమకూర్చుకున్నారు. అంతేకాకుండా తనకు సాహిత్యంపై ఉన్న మక్కువతో కవితలు, వ్యాసాలు రాస్తుండేవాడు. ట్రావెలింగ్, ఫొటోగ్రఫీ అభిరుచి ఏర్పర్చుకొని సినిమాల్లో ప్రవేశం దొరకబుచ్చుకున్నారు.
చదువుకునే రోజుల్లోనే
సాహిత్యంపై ఆసక్తి..
తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో అరవింద్ చదువు కొనసాగింది. తమ గ్రామం నుంచి యూనివర్సిటీకి వచ్చిన మొదటితరం విద్యార్థి అరవిందే కావడం విశేషం. మాస్ కమ్యూనికేషన్ చదువుతూనే వార, మాస పత్రికలు నడిపారు. చిన్నతనంలో పేపర్‌బాయ్‌గా పనిచేయడం వల్ల సాహిత్య పఠనం అలవడింది. అనేక సామాజిక, సాహిత్య అంశాలను స్పృశిస్తూ కవితలు, వ్యాసాలు రాశారు.
సాహిత్య ప్రచారం..
కథ, కవిత్వం, నవలలు విరివిగా చదవటం.. చదివిన పుస్తకాలను నలుగురికీ పంచడం అవసరమని భావించిన అరవింద్ ‘ఆలోచనా’ అనే సంస్థ ద్వారా గ్రామీణ, పట్టణ విద్యార్థులకు చిట్టిపొట్టి జానపద కథల నుంచి దేశభక్తుల జీవితచరిత్ర వరకు పరిచయం చేయడం, చదివించడం చేశారు. హైదరాబాద్ నగరంలోని యూనివర్సిటీల్లో స్టడీ సర్కిల్స్ నిర్వహణ, పుస్తకాలు, సినిమాలు, ఆర్ట్స్ పై సదస్సులు, సభలు నిర్వహించేవారు. దక్షిణ భారతదేశం మొత్తం యాత్రలు చేయడంతో ఫొటోగ్రఫీపై అభిరుచి ఏర్పడింది. ఆయా ప్రాంతాల సంస్కృతి, వైవిధ్యం, ఆర్కిటెక్చర్‌ను కెమెరాల్లో బంధించి వాటిని యూనివర్సిటీల్లో, పట్టణాల్లో ప్రదర్శించారు.

పెద్దఅడిశర్లపల్లి నుంచి కుబేర వరకు..